అమ్మోరై వ‌స్తున్న లేడీ సూప‌ర్‌స్టార్‌

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార పాత్ర‌ల ఎంపిక‌లో వైవిధ్యం ఉంటుంది. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చేలా పాత్ర‌ల ఎంపిక‌, న‌ట‌న ఉంటాయ‌ని న‌య‌న‌తార గురించి ఎవ‌రైనా చెప్పేమాట‌. ఏ పాత్ర‌లోనైనా అభిమానుల్ని ఆక‌ట్టుకోవ‌డం న‌య‌న‌తార ప్ర‌త్యేక‌త‌. అందువ‌ల్లే ఆమె ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో లేడీ సూప‌ర్‌స్టార్ అని పిలుపించుకునే స్థాయికి ఎదిగారు.

తాజాగా ఆర్జే బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూకుతి అమ్మ‌న్ అనే చిత్రంలో ఆధ్యాత్మిక పాత్ర‌లో న‌య‌న‌తార క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాలో న‌య‌న‌తార అమ్మోరు అవ‌తారం ఎత్త‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో న‌య‌న‌తార అమ్మ వారి పాత్ర‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
 
న‌య‌న‌తార అమ్మ‌వారి గెట‌ప్‌కి సంబంధించిన ఫోటోలు ఆక‌ట్టుకుంటున్నాయి. మూకుతి అమ్మన్ గా న‌య‌న్ గెట‌ప్ అదుర్స్ అనిపించుకుంటోంది. కాగా మూకుతి అమ్మన్ చిత్రం ఒక పేద కుటుంబం చుట్టూ తిరుగుతుంద‌ని స‌మాచారం. ఈ సినిమా థియేట‌ర్‌లోనే చూడాల‌ని ద‌ర్శ‌కుడు బాలాజీ స్ప‌ష్టం చేశాడు.

Show comments