నాని గెటప్ సీక్రెట్

హీరో నాని ఇప్పుడు కొత్త గెటప్ లో వున్నట్లు తెలుస్తోంది. మరీ కొత్త గెటప్ అయితే కాదు కానీ, ఎప్పుడూ కనిపించేదాని కన్నా కాస్త డిఫరెంట్ గా. దేనికోసం ఇదంతా అంటే ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో చేయబోయే 'వి' సినిమా కోసమే. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా, నాని సీరియల్ కిల్లర్ గా నటిస్తున్నారన్న వార్తలు ఇప్పటికే బయటకు వచ్చాయి.

ఈ సీరియల్ కిల్లర్ పాత్రకు కాస్త డిఫరెంట్ గెటప్ వుంటే బాగుంటుందని దర్శకుడు-హీరో కలిసి ఆలోచించి, ఆ విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ ఫినిష్ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ విడుదల లక్ష్యంగా తయారు చేయాలనుకున్నారు.

దిల్ రాజు నిర్మించే శర్వానంద్-సమంత ల 96 సినిమా కానీ, నాని-ఇంద్రగంటిల వి సినిమా కానీ డిసెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్. అయితే 96 సినిమాకు సమంత డేట్ ల వల్ల కాస్త గ్యాప్ వచ్చింది. అందువల్ల వి సినిమాను ఫినిష్ చేద్దామనుకున్నారు. కానీ ఇంద్రగంటి తండ్రి మరణించడంతో దీనికి కూడా కాస్త గ్యాప్ తప్పేట్లులేదు.

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది

Show comments