'మారుతీ నగర్ సుబ్రమణ్యం' టైటిల్ సాంగ్

రావు రమేష్ కథానాయకుడిగా, టైటిల్ రోల్‌ పోషించిన సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకుడు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు.

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' టీమ్ తాజాగా సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేసింది..’’ 'మారుతీ నగర్ లో ఫేమస్ అంటే నేనేలే...అందరూ ఇదే మాట అంటారులే’’ అంటూ సాగిన ఈ పాటను భాస్కరభట్ల రాసారు. రామ్ మిరియాల ఆలపించారు. కళ్యాణ్ నాయక్ ట్యూన్ కట్టారు.

సినిమాలో రావు రమేష్ క్యారెక్టరైజేషన్ వివరిస్తూ సాగిందీ 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' టైటిల్ సాంగ్. చుట్టుపక్కల ప్రజలు సలహాలు ఇచ్చినా పట్టించుకోనని, తనకు అదృష్టం తక్కువ ఉంది గానీ, త్వరలో మహారాజ యోగం పడుతుందని చెప్పే పాత్రలో రావు రమేష్ కనిపించనున్నారు.

పాట విడుదల సందర్భంగా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''లుంగీలో రావు రమేష్ గారి లుక్ బావుందని వాట్సాప్, సోషల్ మీడియాలో ఎంతో మంది మెసేజెస్ చేశారు. ఆయన్ను చూస్తే నేటివ్ ఫీలింగ్ వచ్చిందన్నారు. సినిమా సైతం అలాగే ఉంటుంది. నేటివిటీతో కూడిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. వినోదంతో పాటు మంచి కథ, భావోద్వేగాలు సైతం సినిమాలో ఉన్నాయి. ఇప్పటి వరకు రావు రమేష్ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. త్వరలో ట్రైలర్, సినిమా విడుదల తేదీలు వెల్లడిస్తాం'' అని చెప్పారు.

Show comments

Related Stories :