మన్మధుడు తగ్గడం లేదు

నాగ్ లేటెస్ట్ మూవీ మన్మధుడు 2. ఈ సినిమా విడుదల డేట్ ఆగస్టు 9. బాహుబలి ప్రభాస్ సాహో ఆగస్టు 15న వస్తుంది అని తెలిసే, మన్మధుడు 2 డేట్ ప్రకటించారు. ఏదో తాత్కాలికంగా ప్రకటించారు. దగ్గర చేసి వాయిదా వేస్తారు. లేదా మరో డేట్ చూసుకుంటారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.

కానీ లేటెస్ట్ సంగతి ఏమిటంటే మన్మధుడు 2 సినిమా పక్కాగా ఆగస్టు 9న విడుదలకు రెడీ అయిపోతోంది. అస్సలు తగ్గడంలేదు. సాహో వస్తుందని తెలిసే డేట్ వేసాం అని, కొత్తగా వచ్చింది కాదని, 9నే విడుదలకు వెళ్తున్నామని మన్మధుడు 2 యూనిట్ వర్గాల బోగట్టా.

జూలై నెల నుంచి సినిమాల తాకిడి ఫుల్ గా వుంది. జూలై 18న ఇస్మార్ట్ శంకర్, 25న డియర్ కామ్రేడ్, ఆగస్టు 2న రణరంగం, రాక్షసుడు, గుణ 369, 9న మన్మధుడు 2, 15న సాహో, 31 గ్యాంగ్ లీడర్, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో వాల్మీకి, ఇలా వరుసగా సినిమాలు వున్నాయి.

అందుకే ఆగస్టు 9 మిస్ అయితే నెల రోజులకు పైగా వెనక్కు వెళ్లిపోవాలని మన్మధుడు 2ను ముందుగా అనుకున్న డేట్ కే తెస్తున్నారని తెలుస్తోంది.

దొరసాని మనసెరిగిన దొర.. ఏమి చెప్పాడో తెలుసా?

Show comments