మళయాల మహానుభావుడా?

భలే భలే మగాడివోయ్ దగ్గర నుంచి మారుతిపై మంచి అభిప్రాయం ఫిక్సయింది బాబు బంగారం కూడా ఫరవాలేదు. ఇప్పుడు మహానుభావుడు సినిమా ట్రయిలర్ బయటకు వచ్చి ఆ అభిప్రాయాన్ని మరింత పెంచింది.

అయితే ఎప్పుడు అయితే మహానుభావుడు ట్రయిలర్ బయటకు వచ్చిందో, ఒక్కసారిగా ఇండస్ట్రీలో గ్యాసిప్ లు గుప్పుమన్నాయి. మలయాళం సినిమా నార్త్ 24 కాథం అనే సినిమా స్పూర్తిగానో, లేక అదే సినిమాను పట్టుకునో మారుతి మహానుభావుడు సినిమా తీసేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

యూ ట్యూబ్ లో ఈ సినిమా క్లిప్పింగ్ లు అనేకం వున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ గుసగుసలు నిజమే అనిపిస్తోంది. ఆ సినిమా మలయాళం సినిమాల మాదిరిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, చిన్న సినిమాగా నడుస్తుంది. అదే మహానుభావుడులో పెద్ద సినిమాగా మారినట్లు కనిపిస్తోంది. మరి దీనికి మారుతి ఏమంటారో? లేక హక్కులు తీసుకుని ఆ కథనే సైలెంట్ గా మహానుభావుడుగా మార్చేసారో?

Show comments