లగడపాటి వేదిక మీదకు రావాలి

ఆంధ్ర ఆక్టోపస్ అని పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ రెండుసార్లు వరుసగా ప్రలోభాల కారణంగా తప్పుడు సర్వేలు చెప్పి అభాసు పాలయ్యారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఒకసారి అభాసుపాలై కూడా, మళ్లీ బాబు కోసం తప్పుడు సర్వే ఫలితాలు ప్రకటించడానికి లగడపాటి ఎంతమాత్రం సిగ్గు, మొహమాటం పడలేదు.

జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైకాపాకు అనుకూలంగా వస్తాయని తెలిసిన చంద్రబాబు, ట్రంప్ కార్డ్ మాదిరిగా లగడపాటిని వదిలినట్లు కనిపిస్తోంది. పసుపుకుంకుమ పని చేసిందని, అభివృద్ధికి పట్టం కట్టారని చెప్పడమే కాకుండా రాజధానికి భూములు ఇచ్చినవారు దిగులు పడవద్దని చెప్పేస్థాయికి లగడపాటి వెళ్లారు.

కానీ అదే సమయంలో వచ్చిన జాతీయ మీడియా సర్వే ఫలితాలు వేరుగా వుండడంతో జనం లగడపాటిని పక్కనపెట్టారు. అయితే చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం లగడపాటి సర్వేను పట్టుకుని రోజంతా టముకు వేస్తూ కాలక్షేపం చేసింది. జాతీయ మీడియాల సర్వేలను పక్కనపెట్టి లగడపాటి సర్వేను హైలైట్ చేసారు.

అయిదేళ్ల వరకు మళ్లీ సర్వే చేయాల్సిన అవసరం లేదని, అప్పటికి జనాలు అన్నీ మరిచిపోతారనే ధీమాతో లగడపాటి తన తప్పుడు సర్వేను మీడియా ముందు వుంచారు. కానీ ఇప్పుడు కాదు అయిదేళ్ల తరువాత కూడా లగడపాటి జనం ముందుకు రాలేరు. వచ్చినా జనం నమ్మరు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా

Show comments