కృతి శెట్టి క్రేజ్ అలా వుంది మరి

ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకువచ్చింది కృతి శెట్టి. రెండు, మూడో సినిమాలకే కొటి రూపాయల పారితోషికానికి ఎగబాకేసింది. ఇప్పుడు ప్రకటనల విషయంలో కూడా ముందడగు వేస్తోంది.  

అమెరికాలోని ఓ జ్యూయలరీ షాప్ యాడ్ లో నటించడానికి పాతిక లక్షల వరకు చార్జ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ యాడ్ ఇప్పుడు యూట్యూబ్ లో వుంది. నిండా నగలతో గ్లామరస్ గా కనిపిస్తోంది కృతి శెట్టి. ఈ కలర్ ఫుల్ యాడ్ తరువాత ఇక కృతి సినిమాలతో పాటు ప్రకటనల ఆదాయం కూడా బాగానే సంపాదించేలా కనిపిస్తోంది.

కృతి చేతిలో ఇప్పుడు మూడు నాలుగు ప్రామిసింగ్ ప్రాజెక్టులు వున్నాయి. నాగ్ చైతన్యతో బంగార్రాజు, రామ్ తో లింగుస్వామి సినిమా కూడా వాటిల్లో వున్నాయి. చేతిలో సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా కెరీర్ కు ఢోకా వుండదు. 

Show comments