ప్రమాణ స్వీకారం కేసీఆర్ మాత్రమే.. వాళ్లకు నో ఛాన్స్!

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా కూడా కేసీఆరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రత్యర్థులంతా ఏకమైపోరాడినా  ఓడించలేకపోయిన ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ నేడు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. కొన్నాళ్లుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కేసీఆర్ ఇప్పుడు పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు తీసుకుంటున్నారు.

ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు కేసీఆర్ రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. కేసీఆర్ తో పాటు మంత్రులుగా ఎవ్వరూ ప్రమాణ స్వీకారం చేయడంలేదు.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అయితే కేసీఆర్ మాత్రమే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే కేసీఆర్ మంత్రివర్గ ఏర్పాటు పని మొదలుపెట్టనున్నాడని తెలుస్తోంది. కేసీఆర్ గత కేబినెట్లోని మంత్రులు నలుగురు ఓటమి పాలయ్యారు. వారిపట్ల సానుభూతి వ్యక్తంచేసిన కేసీఆర్.. వారికి మళ్లీ మంత్రి పదవులను మాత్రం ఇచ్చేలాలేడు.

ఓడిపోయిన నేతలకు మంత్రి పదవులు ఇస్తే విమర్శలు వస్తాయ్ అని కేసీఆర్ అన్నాడు. గత టర్మ్ లో కేసీఆర్ పక్కపార్టీల తరఫున ఓడిపోయిన వాళ్లకు కూడా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మంత్రి పదవిని ఇచ్చాడు. ఒక ఫిరాయింపు ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవిని ఇచ్చాడు.

ఈసారి మాత్రం అలా చేసేలాలేడు. ఓడిపోయిన నేతలకు మంత్రి పదవులు ఇచ్చేది లేదన్నట్టుగా మాట్లాడేశాడు. 

Show comments