గవర్నర్ ఆదేశాలను పట్టించుకోని స్పీకర్!

కర్ణాటక విశ్వాస పరీక్ష హైడ్రామా గురువారంతో ముగుస్తుందని చాలామంది అనుకున్నా కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు ఆ వ్యవహారాన్ని మరో రోజు ముందుకు లాగింది. విశ్వాస పరీక్షను గురువారమే సభ ముందుకు తీసుకొచ్చినా, దానిపై చర్చ అంటూ గురువారం బలపరీక్ష ఓటింగ్ జరగలేదు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ వాళ్లు గవర్నర్ ద్వారా ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం దక్కకపోవడం విశేషం.

గురువారమే సభలో విశ్వాస పరీక్ష ఓటింగ్ జరగాలని గవర్నర్ ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ ఓటింగ్ ఎప్పుడు జరపాలనేది తన విచక్షణ అధికారం అన్నట్టుగా స్పీకర్ వ్యవహరించారు. గురువారం సభలో విశ్వాస పరీక్షపై చర్చ మాత్రమే అంటూ, ఓటింగ్ తర్వాత అన్నట్టుగా వ్యవహరించారు అసెంబ్లీ స్పీకర్.

దీంతో భారతీయ జనతా పార్టీకి చిర్రెత్తుకొచ్చింది. గురువారం సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం కాబట్టి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా బీజేపీ నేతలు ఊహించుకున్నారు. అయితే విశ్వాస పరీక్ష ఓటింగ్ ను జరపలేదు.

ఈ నేపథ్యంలో గవర్నర్ నుంచి ప్రత్యేకంగా ఆదేశాలు వచ్చాయి. అయితే స్పీకర్ వాటిని పట్టించుకోలేదు. కానీ శుక్రవారం మాత్రం విశ్వాస పరీక్ష ఓటింగ్ జరపకతప్పని పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకల్లా ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈరోజు అయినా ఈ కథ ముగుస్తుందా? లేక మరోరకంగా కొనసాగుతుందా? అనేది కూడా చర్చనీయాంశంగా నిలుస్తోంది.

పూరి ఇంటర్వ్యూలో చెప్పినట్లే సినిమా ఉందా?

అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇలా

Show comments