ఆ సీట్లు వస్తే.. జనసేన మద్దతు ఎవరికి?

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు ముందు వివిధ సర్వేలు వెల్లడి అయ్యాయి. జాతీయ మీడియా వర్గాలు, వివిధ అధ్యయన సంస్థలు ఏపీలో రాజకీయ పరిస్థితి గురించి తమ అంచనాలను వెలువరించాయి. వాటిల్లో చాలావరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ప్రిడిక్ట్ చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లను సాధిస్తుందని ఆ అధ్యయన సంస్థలు అంచనా వేశాయి. ఎంపీ సీట్ల వారీగా జరిగిన వివిధ సర్వేలు అలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందనే అంచనాలను వెలువరించాయి. తెలుగుదేశం పార్టీ మూడు నుంచి ఏడు ఎంపీ సీట్లు నెగ్గే అవకాశం ఉందని మెజారిటీ సర్వేలు తెలిపారు. 

అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే.. జనసేన మాత్రం ఒక్క ఎంపీ సీటు గెలుస్తుందని కూడా ఒక్క సర్వే కూడా చెప్పలేదు. జాతీయ మీడియా సంస్థల అధ్యయనాలను గమనించినా, ఏపీలో రాజకీయ పరిస్థితి గురించి సర్వే చేసిన వివిధ సంస్థలు అయినా.. జనసేన ఎంపీ సీట్లు నెగ్గుతుందనే మాట చెప్పలేదు.

ఇక అసలు కథ ఎలా ఉండబోతోందనేది ఫలితాలు వస్తే కానీ తెలియదు. ఆ సంగతలా ఉంటే.. ఒకవేళ జనసేన అద్భుతం సాధించి ఒకటో రెండో ఎంపీ సీట్లను సాధిస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తిదాయకమైన అంశం. ఎలాగూ జనసేన తరఫున కొంతమంది ప్రముఖులు ఎంపీలుగా పోటీచేశారు. విశాఖ, రాజమండ్రి, నరసాపురంల నుంచి కూడా జనసేన తరఫున మేటి లీడర్లు పోటీలో ఉన్నారు. 

మరి వీరిలో ఏ ఒక్కరో ఇద్దరో నెగ్గితే.. అప్పుడు జనసేన ఏ కూటమిలో చేరుతుందో చూడాల్సి ఉంది. బీజేపీ కూటమి వైపు వెళ్తుందో లేక కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గుచూపుతుందో, ఫెడరల్ ఫ్రంట్ అంటుందో చూడాలి! ఏం అనాలన్నా.. ముందుగా ఎంపీగా ఎవరైనా నెగ్గితేనే సుమా!

రాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

జెర్సీ గురించి నాని చెప్పిన నిజాలేంటి

Show comments