బీజీపీ రధానికి జనసేన చక్రాలు ?

విజయనగరం జిల్లాలోని  ప్రముఖ కోవెల రామతీర్ధంలో  కోదండ రాముడి శిరస్సుని వేరు చేసిన ఘాతుకం రాష్ట్రంలో ఎంతగా రాజకీయ రచ్చను పుట్టించిందో తెలిసిందే. చంద్రబాబు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి మరీ ఆధ్యాత్మిక క్షేత్రంలో  హల్ చల్ చేశారు.

వరసగా రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన మందీ మార్బలంతో రాముడి కోవెల వద్ద ఆందోళనలు చేశారు. వాటిలో బీజేపీ మిత్ర పక్షం జనసేన కూడా పాల్గొంది.

సరే దాని మీద ప్రభుత్వం సీరియస్ అయింది సిట్ ని విచారణకు నియమించింది. ఇక రాజకీయం ఇక్కడితో ఆగుతుంది అనుకుంటే పొరపాటేనంటున్నాయి పార్టీలు.  రామతీర్ధం పోరాట కమిటీని తాజాగా జనసేన నియమించడంతో ఇది అంతులేని పోరాటం అనే అర్ధమవుతోంది.

ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన నలుగురు పార్టీ సభ్యులతో దీన్ని ఏర్పాటు చేసిన జనసేన అధినాయకత్వం బీజేపీతో కలసి  రామతీర్ధం ఘటన మీద పోరాటం చేస్తుందని పేర్కొంది. అంటే రామతీర్ధం పేరిట రాజకీయ పోరాటాలు, ఆరాటాలు ఇంకా కొనసాగుతాయని చెప్పకనే మిత్ర కూటమి పెద్దలు చెబుతున్నారన్న మాట .

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

Show comments