నాదెండ్ల మనోహర్ అవుటాఫ్ జనసేన?

జనసేనలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరువాత కీలకమైన వ్యక్తి నాదెండ్ల మనోహర్. ఇప్పుడు ఆయన ఎక్కడ వున్నారు. గత కొంతకాలంగా ఆయన కనిపించడం లేదు. ఎప్పడూ పవన్ కళ్యాణ్ ను వెన్నంటి వుండి, ఇద్దరూ కలిసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నంతగా ఫొటొల్లో కనిపించేవారు. కానీ ఇప్పుడు ఆయన జాడ జనసేన సమావేశాల్లో కనిపించడం లేదు. 

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ప్రస్తుతం జనసేన కార్యక్రమాలకు, పవన్ కళ్యణ్ కు నాదెండ్ల మనోహర్ దూరంగా వున్నారు. పవన్ వైఖరి నప్పక ఆయన దూరం జరిగినట్లు తెలుస్తోంది. పవన్ కు సాన్నిహిత్యంగా వెళ్లిన చాలా మంది ఆయనకు దూరం జరుగుతూ వుంటారు. ఇది చాలా కామన్.గతంలో శరత్ మరార్ లాంటి అత్యంత సన్నిహితుడే దూరం జరిగారు. మారిశెట్టి రాఘవయ్య రెండు సార్లు దూరం జరిగారు. అలాంటిది నాదెండ్ల మనోహర్ దూరం జరగడంలో వింత లేదు. అయితే పవన్ తరువాత పార్టీలో లెఫ్ట్ నెంట్ గా వుంటూ వచ్చిన మనోహర్ లేకపోతే, ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేవారు ప్రస్తుతానికి అయితే లేనట్లే.

తెలంగాణలో చేసారు మేము చేసాం అంటావా

Show comments