'హీరో' చెక్కుడుకు డబ్బుల్లేవ్...?

సీనియర్ హీరో అయినా, యంగ్ హీరోలు అయినా, ఇవ్వాళ సినిమాలు చేస్తే డిజిటల్ కరెక్షన్ అన్నది కంపల్సరీ. ఎంత చెక్కుడు వుంటే అంత ఖర్చు. సల్మాన్-షారూఖ్ ల సినిమాలకు మూడు కోట్లు కేవలం వాళ్ల బాడీ, ఫేస్ షేపింగ్ కే ఖర్చు అవుతుంది. మహర్షి సినిమాకు కోటి రూపాయలు ఇందుకోసమే ఖర్చు చేసారు. అందంగా వున్న హీరోను మరింత అందంగా చూపించాలి. అందం తక్కువైన, వయసు ఎక్కువైన హీరోను ఇంకాస్త కష్టపడి అందంగా చూపించాలి.

ఇంతకీ విషయం ఏమిటంటే, రాబోయే ఓ సీనియర్ హీరో సినిమాలో ఈ చెక్కుడుకు బడ్జెట్ లేదని, ఏదో అలా అలా చేస్తున్నారని వినిపిస్తోంది. అసలే సీనియర్ హీరో. పైగా విగ్గులు, వయసు వల్ల మొహం మీద, గొంతు దగ్గర, కళ్ల కింద వచ్చిన మార్పులు అన్నీ కవర్ చేయాలి. అరవై లో కూడా ఎంత మన్మధుడిలా వున్నాడో అని 60లు వచ్చిన వాళ్లు ఈర్ష్య పడేలా వుండాలి. ఇలా చేయాలంటే ఓ కొటి నుంచి రెండు కోట్లు ఖర్చు చేయాలి.

కానీ త్వరలో విడుదల కాబోయే ఈ సినిమాకు ఇఫ్పటికే ఓవర్ బడ్జెట్ అయిందని, మార్కెట్ లేక, డెఫిసిట్ తో విడుదలవుతోందని వార్తలు వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇంకా తను ఈ 'చెక్కడు' కు ఖర్చు చేయలేనని నిర్మాత చేతులు ఎత్తేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటివి అన్నీ ముంబాయి, లేదా ఇంటర్ నేషనల్ కంపెనీలకు కాంట్రాక్టు ఇస్తారు.

కానీ బడ్జెట్ లేదని, లోకల్ గా హైదారాబాద్ లో డిఐ చేసే వాళ్లనే, వీలయితే ఈ పని కూడా చేయమని వదిలేసినట్లు తెలుస్తోంది.మరి ఇంతకీ ఇందులో ఎంత వరకు వాస్తవం వుందో? సినిమా వచ్చాక సదరు సీనియర్ హీరోను తెరపై చూస్తే తప్ప తెలియదు.

 

Show comments