గిల్డ్ ప్రతిపాదనకు 'మా' నో?

చిత్రపరిశ్రమలో  నటులంతా తమ తమ రెమ్యూనిరేషన్లు 20 శాతం మేరకు తగ్గించుకోవాలనే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతిపాదనను నటీనటుల సంఘం మా వ్యతిరేకిస్తోందా? వినిపిస్తున్న సమాచారం అయితే అలాగే వుంది.

పారితోషికం తగ్గించుకునే విషయంలో టాప్ లైన్ లో వున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. 

పారితోషికాలు తగ్గించుకునే విషయమై గిల్డ్ తరపున నటీనటుల సంఘ మా కు లేఖ అందినట్లు తెలుస్తోంది దానిపై కాస్త గట్టి డిస్కషన్ నే జరిగినట్లు బోగట్టా. ఇక్కడ సమస్య ఏమిటంటే, కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలకు రెమ్యూనిరేషన్లు తగ్గించుకోవడానికి యాక్టర్లు రెడీగానే వున్నారు.

కానీ అలా కాకుండా కోవిడ్ తరువాత ప్రారంభమయ్యే సినిమాలకు కూడా తగ్గించుకోమనడం సరికాదన్నది నటీనటుల వాదనగా తెలుస్తోంది.

ఎంతో కష్టపడి, ఎన్నాళ్లో ఓర్చి ఒక్కో సినిమా చేసుకుంటూ వస్తే, ఈ స్టేజ్ కి చేరామని, ఇప్పుడు కూడా తమ రెమ్యూనిరేషన్లు వేలు, లక్షలే తప్ప కోట్లు కాదని, అలాంటిది తమను కంటిన్యూగా తగ్గించుకోమని అడగడం ఏమిటని నరేష్, జీవిత లాంటి మా సంఘ ప్రతినిధుల అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 

జగన్ లేఖ.. జాతి మీడియా తప్ప

Show comments