యాంకర్ గీతాంజ‌లి అయ్య‌ర్ క‌న్నుమూత‌!

ప్ర‌ముఖ టీవీ న్యూస్ యాంక‌ర్, తొలిత‌రం ఇంగ్లీష్ న్యూస్ ప్ర‌జెంట‌ర్ గీతాంజ‌లి అయ్య‌ర్ కన్నుమూశారు. దూరదర్శన్‌లో మొదటి ఇంగ్లీష్ న్యూస్ ప్రజెంటర్‌లలో ఆమె ఒకరు. 

దాదాపు 30 సంవత్సరాలకు పైగా జాతీయ న్యూస్ చానళ్లలో ఆమె వార్తలను వినిపించారు. 1971లో దూరదర్శన్‌లో చేరిన ఆమె నాలుగు సార్లు ఉత్తమ యాంకర్‌గా అవార్డు పొందారు. ఆమె విశిష్టమైన సేవలకు గానూ 1989లో అత్యుత్తమ మహిళలకు ఇచ్చే ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డును గెలుచుకున్నారు.

దూరదర్శన్‌లో మూడు దశాబ్దాలకు పైగా విజయవంతమైన కెరీర్ తర్వాత, గీతాంజలి కార్పొరేట్ కమ్యూనికేషన్స్, ప్రభుత్వ అనుసంధానం.. మార్కెటింగ్‌లోకి ప్రవేశించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)లో కన్సల్టెంట్‌గా కూడా వ్యవహరించారు.  భారతదేశంలోని వరల్డ్ వైడ్ ఫండ్‌లో ప్రధాన దాతలకు హెడ్‌గా ఉన్నారు. అంతేకాకుండా “ఖందాన్” అనే  సీరియల్‌లో కూడా న‌టించారు.

Show comments