దిల్ రాజుకు అంత నచ్చిందా ఆ సినిమా?

సాధారణంగా తన దివాణంలోనే స్వంతంగా కథలు రెడీ చేయించుకుంటారు నిర్మాత దిల్ రాజు. అలాంటిది ఓ తమిళ సినిమా, అదికూడా ఇంకా నిర్మాణంలో వుండగానే, రీమేక్ రైట్స్ కొనేసారు. అదీ టాలీవుడ్ లో టాక్.

విజయ్ సేతుపతి-త్రిష కాంబినేషన్ లో 96 అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది. సినిమాటోగ్రాఫర్ ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు కథకుడు-దర్శకుడు. ఈ సినిమా ఎలా పడిందో దిల్ రాజు దృష్టిలో పడింది. మరి వాళ్లు అడిగారో, ఈయనే అడిగారో, మొత్తంమీద చెన్నయ్ వెళ్లి సినిమా చూసారు.

ఆ వెంటనే డబ్బింగ్ వద్దు, తాను రీమేక్ చేసుకుంటా అంటూ బేరం కుదుర్చుకుని వచ్చేసారు. ప్రస్తుతం దిల్ రాజు ప్రాజెక్టుల వేటలో వున్నారు. మహేష్ సినిమా, వెంకీ-వరుణ్ తేజ్ సినిమా, రామ్ సినిమా మాత్రమే వున్నాయి. ఆ తరువాత ఏంటీ అన్నది ఇంకా క్లారిటీలేదు. నాని ఓ సినిమా చేయడానికి రెడీగా వున్నారు. 

ఇలాంటి టైమ్ లో 96 సినిమా రీమేక్ రైట్స్ కొనేయడం అంటే ఆ కథ అంతగా ఆకట్టుకుని వుండాలి దిల్ రాజును.