డిసెంబర్ 6న మిస్ మ్యాచ్

'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం  'మిస్ మ్యాచ్'. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ నాయికగా నటిస్తున్నారు.

గతంలో 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. ఈ సినిమా డిసెంబర్ 6 న 'మిస్ మ్యాచ్' ను  విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు  మీడియాకు అధికారికంగా ప్రకటించారు.

ఇటీవల ప్రముఖ దర్శకుడు 'క్రిష్' చేతుల మీదుగా  విడుదల అయిన 'మిస్ మ్యాచ్' తొలి ప్రచార చిత్రాలు, విక్టరీ వెంకటేష్ గారు విడుదల చేసిన చిత్రం టీజర్ కు ప్రేక్షకులనుంచి విశేషమైన స్పందన లభించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి మరోసారి కృతఙ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ..."మిస్ మ్యాచ్ చిత్ర కథను భూపతిరాజ గారు ఇచ్చారు. ఈ కథ నాకు రావడం అదృష్టం. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం సినిమాకు ప్లస్. ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ ఐశ్వర్య రాజేష్ పక్కన నేను నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.  అన్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ... ఒకమంచి కథ మిస్ చేసుకోకూడదని ఈ సినిమా చేసాను. భూపతిరాజ గారి కథ చాలా బాగుంది. దర్శకుడు కథను అందంగా తెరమీద చూపించారు. నా పాత్ర ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది.  అన్నారు. దర్శకుడు ఎన్ వి. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ..."ఈ చిత్రంలో హీరో హీరోయిన్ ల పాత్రలు కొత్తగా ఉంటాయి.

సరికొత్త కధ,కథనాలతో తో దర్శకుడిగా తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది.  నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు  మాట్లాడుతూ..ఈ చిత్రంలో ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ చాలా బాగా నటించారు. హీరోయిన్ క్రీడా నేపధ్యం కలిగి ఉన్న పాత్రలో, ఛాలెంజింగ్ రోల్ లో నటించింది. అని తెలిపారు.

Show comments