దర్శకుడి అలవాటు..హీరో అగచాట్లు

ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు వుంటుంది. స్మోకింగ్ కావచ్చు. మరేదైనా కావచ్చు. అది నచ్చిన వారు పక్కన వున్నా ఒకె. పడని వారు పక్కన వుంటే మాత్రం సమస్యే. అందుకే నో స్మోకింగ్ జోన్...స్మోకింగ్ రూమ్ లాంటివి ప్రారంభమయ్యాయి. 

టాలీవుడ్ లో ఓ టాప్ స్టార్ కు ఓ డైరక్టర్ అలవాటు ఇబ్బందికరంగా మారిందని తెలుస్తోంది. విషయం ఏమిటంటే ఆ డైరక్టర్ కు ఓ తరహా కిళ్లీ అలవాటు వుంది. 

రోజుకు ఓ డజను వరకు లాగించేస్తారు. అది పడకపోతే ఆయన బుర్ర పరుగుపెట్టదు. కానీ పక్కన వున్నవాళ్లకే సమస్య. దాని వల్ల వచ్చే తుంపరలు, అన్నింటికి మించి ఆ ప్రత్యేకమైన వాసన.  

ప్రస్తుతం ఆ డైరక్టర్ చేస్తున్న భారీ సినిమాలో చేసే టాప్ హీరోకు అది సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఆ వాసన ఆ హీరోకు అస్సలు పడడం లేదట. ప్రస్తుతానికి అయితే షూటింగ్ జరగడం లేదు. మళ్లీ స్టార్ట్ అయ్యాక అయినా హీరో ఆ డైరక్టర్ కు ఆ విషయం తెలిసేలా చేస్తాడేమో?

Show comments