సినిమా ఆఫీసును ఖాళీ చేయమన్న ఓనర్

సినిమా కంపెనీలకు బిల్డింగ్ అద్దెకు ఇవ్వాలంటేనే చాలా మంది జంకుతారు. ఎందుకంటే కొత్త కంపెనీలు ఎన్నాళ్లు వుంటారో, వుండరో తెలియదు. అదీ అనుమానం. అయితే పెద్ద సంస్థలు అయితే బిల్డింగ్ అప్పగించి హ్యాపీగా నెల నెలా అద్దె తీసుకుంటూ హ్యాపీ గా వుంటారు. పీకల మీదకు అవసరం వస్తే తప్ప ఖాళీచేయమని అడగరు. 

అయితే ఇండస్ట్రీలోని ఓ టాప్ ప్రొడక్షన్ ఆపీసును ఆ బిల్డింగ్ ఓనర్ ఖాళీ చేయమని కోరుతున్నట్లు బోగట్టా. దానికి ఆ ఓనర్ చాలా రీజనబుల్ కారణమే చెబుతున్నారు. అది వేరే సంగతి. కానీ అసలు కారణం వేరే వుందని తెలుస్తోంది. ఈ సినిమా ఆఫీసు లోనే వున్న మరో బిజినెస్ ఆఫీసు దగ్గర కాస్త ఎక్కువ గడబిడ అవుతోందన్నది అసలు కారణంగా తెలుస్తోంది.

పొలిటికల్ టచ్ వున్నవారు వస్తుండడం, పేకాటల్లాంటివి సాగుతుండడం, ఇలాంటివి అన్నీ చూసి, తన స్వంతానికే అవసరం వుందని వీలయినంత త్వరగా ఖాళీ చేయమని కోరినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం స్టార్ట్ చేస్తున్న భారీ సినిమా పూర్తయ్యాక ఖాళీ చేస్తామని చెప్పినట్లు బోగట్టా.

ఇదిలా వుంటే ఇదే సంస్థ తీసున్న మరో భారీ సినిమా కోసం కొత్త ఆఫీసు తీసి, పూజ చేసారు. ఆ విధంగా ఆ సంస్థ రెండో ఆఫీసును స్టార్ట్ చేసుకుంది.

మన పాలన-మీ సూచన, 2వ రోజు

Show comments