స్టాలిన్- కేసీఆర్ సమావేశం, బాబుకు అంత టెన్షనా!

డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సమావేశం కావడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు. స్టాలిన్ తో కేసీఆర్ సమావేశం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన పరపతిని అంతా ఉపయోగించి డీఎంకే ఎమ్మెల్యే దొరై మురుగన్ ను అమరావతికి  రప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. నిన్న స్టాలిన్- కేసీఆర్ ల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంపై మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. ఆ భేటీకి అంత ప్రాధాన్యత లేదని స్వయంగా స్టాలిన్ తేల్చేశారు.

అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయలో చాలా టెన్షన్ పడినట్టుగా ఉన్నారు. దొరై మురుగన్ ను చంద్రబాబు నాయుడు పిలిపించుకోవడమే అందుకు సాక్ష్యం. నిన్నటి కేసీఆర్- స్టాలిన్ ల సమావేశంలో 
సదరు ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. దీంతో చంద్రబాబు నాయుడు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి సదరు ఎమ్మెల్యేను పిలిపించుకున్నట్టుగా ఉన్నారని స్పష్టం అవుతోంది. అయినా కేసీఆర్ ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ ఉండటంపై చంద్రబాబు నాయుడు చాలా టెన్షన్ పడుతూ ఉండటం కొత్త ఏమీకాదు.

ఇదివరకూ బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తో కేసీఆర్ సమావేశం అయినప్పుడు.. ఆ పార్టీ ఎంపీ ఒకరిని ప్రత్యేకంగా ఏపీకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు డీఎంకే ఎమ్మెల్యేను రప్పించుకున్నారు. అయినా కేసీఆర్ వేరే పార్టీల అధినేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే చంద్రబాబు ఎందుకు మరీ ఇంత టెన్షన్ పడుతున్నారో!

వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!

Show comments