బోటు తొలిగించారు.. చూశావా లోకేష్!

ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోయి ప్రకాశం బ్యారేజ్ గేటుకు అడ్డంపడింది ఓ బోటు. దీనిపై కొన్నిరోజుల కిందట లోకేష్ చేసిన రాద్దాంతం గురించి అందరికీ తెలిసిందే. ఆ బోటును అడ్డంగా పెట్టి, చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకు వైసీపీ కుట్ర పన్నిందంటూ కామెడీ చేసి అభాసుపాలయ్యారు చినబాబు. అలా అందరి దృష్టిని ఆకర్షించిన ఆ బోటును ఎట్టకేలకు తొలిగించారు అధికారులు.

ఎగువ నుంచి భారీస్థాయిలో ప్రవాహం రావడంతో ఇన్నాళ్లూ బోటును తొలిగించడం కష్టంగా మారింది. ఇప్పుడు కాస్త వరద ఉధృతి తగ్గడంతో బ్యారేజీలో 68వ గేటుకు అడ్డంపడిన ఆ బోటును అతికష్టంమీద బయటకు తీయగలిగారు అధికారులు. దీని కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. భారీ క్రేన్లు, స్టీల్ రోప్స్ సహాయంతో ఆ బోటును బయటకు తీయగలిగారు.

ఇక్కడ సమస్య బోటును బయటకు తీయడం కాదు. బ్యారేజీకి, బ్యారేజ్ గేట్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా బయటకుతీయడం. అందుకే ఇంత శ్రమపడాల్సి వచ్చింది. బోటు తొలిగించడంలో ఈ ప్రాంతంలో ఉన్న గేటును మూసివేయడానికి మార్గం సుగమమైంది. లేదంటే రాబోయే రోజుల్లో మరింత నీరు వృధా అయ్యేది. బోటు తొలిగించిన సందర్భంగా మరోసారి నెటిజన్ల ట్రోలింగ్ కు గురయ్యారు లోకేష్.

తండ్రికొడుకులిద్దరూ ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకోండంటూ కొందరు వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. ఇప్పుడు మరోసారి వరద వచ్చి చంద్రబాబు ఇల్లు మునిగిపోతే ఈసారి లోకేష్ ఎలాంటి కామెంట్స్ పెడతారో చూడాలంటూ మరికొందరు ఛలోక్తులు విసిరారు.

బ్యారేజీ ఉండడం వల్లే నాన్నారి ఇల్లు మునిగిపోతోందని, ఏకంగా బ్యారేజీని తొలిగించాలంటూ లోకేష్ డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఇంకొందరు సెటైర్లు వేశారు. 

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?