కోడెల మృతిపై బీజేపీ బురద రాజకీయం

తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో జరిగే ఏ చిన్న విషయాన్నీ వదిలిపెట్టదు భారతీయ జనతాపార్టీ. రాజకీయ లబ్ధికోసం పూర్తిస్థాయిలో వాడుకుంటుంది. తాజాగా ఏపీలో జరిగిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్యను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. పోలవరం రివర్స్ టెండర్లు, విద్యుత్ పీపీఏల రద్దు విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ తమకు కంటగింపుగా ఉన్నా ఇప్పటివరకూ తేలుకుట్టిన దొంగల్లా ఉన్న బీజేపీ నేతలు కోడెల మృతితో మళ్లీ బైటకొచ్చారు.

ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై తమకు కొన్ని ఫిర్యాదులు అందాయన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు కూడా వచ్చాయని, వీటిపై కేంద్రంతో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా చట్టాలను చేతిలోకి తీసుకోకూడదన్నారు. కోడెల మృతి విచారణ అంశాన్ని హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్న కిషన్ రెడ్డి పూర్తిస్థాయి విచారణ జరుపుతామని వెల్లడించారు.

కిషన్ రెడ్డి వ్యాఖ్యల వెనక బీజేపీ రాజకీయ దురుద్దేశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కోడెల వ్యవహారంతో కేంద్రం సాధించేదేమీ లేకపోయినా తమ వక్రబుద్ధిని మాత్రం బైటపెట్టుకుంది. ఓవైపు తమపై ఏపీ పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నానాయాగీ చేసిన రెండు రోజులకే సాక్షాత్తూ కేంద్రమంత్రి ఏపీ పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని మాట్లాడటం ఓ వ్యూహం ప్రకారం జరిగిందనే భావించాలి.

అయితే ఇలాంటి బెదిరింపులేవీ సీఎం జగన్ ముందు పనిచేయవు, ఆ విషయం బీజేపీ నేతలకి కూడా తెలుసు. కానీ అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదిలిపెట్టకుండా తోక జాడిస్తూనే ఉంది కాషాయదళం.

మారని చంద్రబాబు నాయుడు తీరు

Show comments