విశాఖ సాగరతీరాన బాలు విగ్రహం

బాలూ ఇపుడు దివికేగిపోయారు. ఆయన వినిపిస్తున్నారు కానీ ఎవరికీ  ఇకపైన కనిపించరు. నిజానికి ఇది అభిమానులకు గుండెలు పిండే చేదు వార్త. అందుకే కనులారా ఆయన  నిండు రూపాన్ని ఎదురుగా చూసుకుందామని అశ పడుతున్నారు.

విశాఖలో విలువైన అనుబంధం పెనవేసుకున్న బాలూకు ఇక్కడ సాంస్క్రుతిక సంస్థలతో కూడా ఎంతో దగ్గరితనం ఉంది. దాంతో బాలూ ఇక లేడన్నవార్తతో మెగా సిటీ అంతా కన్నీరుపర్యంతం అయింది,  ఘననివాళి అర్పించింది.

ఇక బాలూ నిలువెత్తు విగ్రహాన్ని విశాఖ సాగరతీరాన ఏర్పాటు చేయాలని కూడా సాంస్క్రుతిక సంఘాల నుంచి డిమాండ్ వస్తోంది. అవసరం అయితే తాము నిధులు సమకూర్చుంటామని స్థలం ఇస్తే చాలని కూడా విశాఖ కళాభిమానులు ముందుకువస్తున్నారు.

విశాఖ సాగరతీరం వెంబడి మహనీయుల విగ్రహాలు ఇప్పటికే కొలువుతీరాయి. వాటి సరసన బాలూ విగ్రహం కూడా ఉంటే సంపూర్ణత్వం వస్తుందన్నది సగటు విశాఖ పొరుడి ఆశగా ఉంది. మరి దివికేగిన బాలు అలా విగ్రహం రూపంలో పలకరిస్తూంటే సాగర కెరటాలు కూడా ఉప్పొంగి ఆనందిస్తాయనడంలో  సందేహం లేదుగా.

విశాఖ‌కే అన్ని కావాలంటున్న విజ‌య‌సాయిరెడ్డి!

Show comments