ఇంకా బురదజల్లడం ఆపని అను'కుల' మీడియా

ఆఖరి నిమిషం వరకు ఏదో ఒకటి చేయాలి. కొత్తకొత్త ఆరోపణలు సృష్టించాలి. ఎలాగైనా జగన్ ను కార్నర్ చేయాలి. ఇదే బాబు అనుకూల మీడియా లక్ష్యం. దాదాపు ఐదేళ్లుగా ఇదే లక్ష్యంతో పనిచేసిన ఓ సెక్షన్ మీడియా, అధికార మార్పిడి జరగబోతోందని తెలిసి కూడా ఇంకా బురద జల్లడం ఆపలేదు. అదేపనిగా జగన్ పై అర్థంలేని ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా రాజధాని అంశంపై జగన్ కేంద్రంగా విమర్శలు ఎక్కుపెట్టింది బాబు మీడియా.

జగన్ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని ప్రాంతాన్ని మార్చేస్తారట. గతంలో వైసీపీ చెప్పినట్టుగానే దొనకొండకు రాజధానిని తరలించేస్తారట. ఇలా కొత్త అసత్యపు ప్రచారాన్ని ప్రారంభించింది బాబు తోకపత్రిక. ఇక్కడితో ఆగలేదు సదరు మీడియా. జగన్ కు చెందిన నేతలు, వ్యాపారులు, బంధువులు ప్రస్తుతం దొనకొండలో వేల ఎకరాలు కొనుగోలు చేస్తున్నారట. వీళ్లంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లేనట. ఇలా సాగుతున్నాయి ఆ అసత్యపు కథనాలు.

నిజంగా రాజధానిని మార్చే ఉద్దేశం ఉంటే అమరావతి ప్రాంతంలో జగన్ సొంత ఇల్లు ఎందుకు కట్టుకుంటారు. సరిగ్గా ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందురోజు ఆ ఇంటికి తన మకాం మార్చబోతున్నారు జగన్. అంతేకాదు, పార్టీ సెంట్రల్ ఆఫీస్ ను కూడా హైదరాబాద్ నుంచి తాడేపల్లికి మారుస్తున్నారు. ఆ ప్రక్రియ కూడా మొదలైంది. మరో 2 రోజుల్లో అమరావతి కేంద్రంగా వైసీపీ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు సాగిస్తుంది.

ఓవైపు వైసీపీ నుంచి ఇంత జరుగుతుంటే, మరోవైపు బాబు అనుకూల మీడియా మాత్రం జగన్ కు అమరావతి అంటే ఇష్టంలేదంటూ అవాస్తవ కథనాలు ప్రచురిస్తూనే ఉంది. ఎన్నికల ప్రచారం నుంచే ఈ తరహా వార్తల్ని వండివార్చింది ఆ మీడియా. అప్పట్లో వీటిని జగన్ ఖండించారు కూడా. కానీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా జగన్ పై అదేపనిగా బురదజల్లడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

జగన్ పై వ్యతిరేకంగా వార్తలు రాయడమనే యజ్ఞంలో ఇదొక ఎపిసోడ్ మాత్రమే. ఇప్పటికే ఎన్నో అంశాలతో ముడిపెడుతూ జగన్ పై లేనిపోని వార్తలు రాసింది ఆ పత్రిక. ఇప్పుడు రాజధాని అంశం చుట్టూ కథలు అల్లుతోంది. 22 నుంచి జగన్ పూర్తిగా అమరావతిలోనే ఉండబోతున్నారు. అప్పుడీ పత్రిక తన వ్యాఖ్యల్ని ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.

వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!

Show comments