అల్లూరి సహచరుడికి అరుదైన గౌరవం

అల్లూరి సీతారామరాజు తెల్ల దొరలతో అలుపెరగని పోరాటమే చేశారు. ఆ పోరాటంలో ఆయన వెంట ఉన్నది గిరిజనుడైన గంటం దొర. అల్లూరిని వెన్ను దన్నుగా నిలిచి ఆంగ్లేయులను ముప్పతిప్పలు పెట్టారు. అల్లూరితో పాటు గంటం దొరకు గుర్తింపు వచ్చిందా అంటే లేదు అనే గిరిజనులు అంటారు.

ఇటీవల కాలంలో గంటం దొరను తలచుకోవడం ఆయన జయంతి వర్ధంతులను ఘనంగా ఉత్సవాలుగా నిర్వహించడం వంటివి చేస్తున్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి బుధవారం అరకులో గంటం దొర వర్ధంతి వేడుకలను నిర్వహిస్తూ గిరిజనంలో ఆయన లాంటి నాయకుడు లేడు అని కీర్తించారు.

గంటం దొర విగ్రహాన్ని కొయ్యూరు మండలంలో ఏర్పాటు చేశారు. దాన్ని ఎంపీ ఆవిష్కరించారు. గంట దొర స్పూర్తి గిరిజనానికి అవసరం అన్నారు. ఆ రోజుల్లోనే ఆయన చూపిన చొరవ ధైర్యం నేటి తరానికి ఆదర్శప్రాయం అన్నారు. ఆయనను దేశం కోసం పోరాడిన యోధుడిగా అంతా గుర్తుంచుకోవాలని అన్నారు.

గంటం దొర గురించి గిరిజనానికి తెలియచేయాల్సిన అవసరం ఉంది అన్నారు. అల్లూరితో పాటు ఉంటూ ఆయన అడుగు జాడలలో నడుస్తూ గంటం దొర ఆనాడే గిరి సీమలలో అగ్గి పుట్టించారని వైసీపీ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. ఒకపుడు అల్లూరి విగ్రహాలే పెద్దగా ఉండేవి కావు.

ఇపుడు అల్లూరిని అంతా కీర్తిస్తున్నారు. స్మరిస్తున్నారు. ఆయనతో పాటు గంటం దొరకు గిరి సీమలలో నీరాజనం పలుకుతున్నారు. వారు వందేళ్ళ క్రితం చేసిన త్యాగాలను ఈ తరం ఆసక్తిగా తెలుసుకుంటోంది. అది అవసరం కూడా అని మేధావులు అంటున్నారు.

Show comments