ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మరింత రసవత్తరంగా!

వచ్చే నెల రెండో తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించబోతున్నట్టుగా ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. పది నుంచి 15 రోజుల పాటు సభ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.  మరో పక్షం  రోజుల్లోనే సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి.

ఈ సారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరింత రసవత్తరంగా ఉండబోతున్నాయని స్పష్టం అవుతోంది. గత వారం పది రోజుల పరిణామాలు రాజకీయ వేడిని పెంచాయి. నేతలు దూషణలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మరింత లొల్లి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సారి సభలో తెలుగుదేశం పార్టీ తరఫున గళం విప్పే వాళ్ల సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు తదితరులు  కామ్ అయిపోయారు. క్రితం సెషన్స్ లోనే వీరు నోరు మెదపలేదు. ఇక వల్లభనేని వంశీ మోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా విషయాన్ని ప్రకటించారు.

ఆయనను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సభలో తెలుగుదేశం పార్టీకి మరింత ఇరకాటం అయితే తప్పదని స్పష్టం అవుతోంది. ఏదో ఒక వంక చూసుకుని టీడీపీ వాకౌట్లనే ఎంచుకునే అవకాశాలు లేకపోలేదు.

Show comments