‘అల్లూరి’లో వైరల్ పాయింట్?

శ్రీవిష్ణు లేటెస్ట్ సినిమా అల్లూరి. ఈ సినిమా కు బజ్ తేవాలని హీరో శ్రీవిష్ణు చాలా కష్టపడుతున్నాడు. ఆంధ్ర అంతా పర్యటించాడు. హీరోలు నాని, బన్నీ ల సహకారంతో సినిమాకు మరింత బజ్ తేవాలని ప్రయత్నిస్తున్నాడు. 

నిజానికి సినిమా ట్రయిలర్ చూస్తే ఓ మామూలు కమర్షియల్ పోలీస్ కథ లా కనిపిస్తోంది. మరి శ్రీవిష్ణు ఎందుకు ఇంతగా ఈ సినిమాను నమ్ముతున్నట్లు? అన్నది సందేహం.

సినిమాలో ఇప్పటి వరకు బయటకు వెల్లడించని పాయింట్ ఏదో వుందని తెలుస్తోంది. ట్రయిలర్ లో కూడా ఆ పాయింట్ వరకు తీసుకెళ్లలేదు. ఈ పాయింట్ ను బలంగా నమ్మే శ్రీవిష్ణు సినిమాను జనంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. 

ఇప్పటి వరకు శ్రీవిష్ణు చేసిన సినిమాల్లో చాలా వరకు వైవిధ్యంతో కూడుకున్నవే. ఒకటి రెండు మరీ ఓవర్ ది బోర్డ్ వెళ్లి చేసినవి వున్నాయి కానీ మిగిలినవన్నీ మంచి ప్రయత్నం అనిపించుకున్నవే.

మరి అల్లూరిలో ఆ కొత్త పాయింట్ లేదా వైరల్ పాయింట్ ఏమిటన్నది సినిమా విడుదలయితే కానీ తెలియకపోవచ్చు. అంతగా వైరల్ పాయింట్ అయితే సినిమాను గట్టెక్కించవచ్చు.

Show comments