అఖండ తరువాత కథలో మార్పులు?

రాయలసీమ ఫ్యాక్షన్, మైనింగ్ ఇలాంటి వ్యవహారాలు కలిపి బాలయ్య-మైత్రీ మూవీస్ సినిమా కథ వుంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. షూటింగ్ జ‌రుగుతోంది కూడా. ఈ సినిమాలో మాస్ ఎలివేషన్లు ఎలాగూ వుంటాయి. క్రాక్ సినిమా హిట్ అయిందే ఆ ఎలివేషన్లతో. 

బాలయ్య లాంటి మాస్ హీరో అంటే ఆ మాత్రం ఎలివేషన్లు ఎలాగూ అవసరం పడతాయి. దీనికి తోడు కొత్తగా ఒకటి రెండు సీన్లు యాడ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అఖండ సినిమా సక్సెస్ వెనుక డివోషనల్ టచ్ కూడా వుంది. 

బాలయ్య సినిమాల్లో ఆ టచ్ ఎప్పుడూ వుంటుంది. అఖండలో కాస్త ఎక్కువ వుంది. అయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలో కూడా డివోషనల్ టచ్ తో ఒకటి రెండు సీన్లు చేర్చడానికి ప్రయత్నించమని బాలయ్య కోరినట్లు తెలుస్తోంది. ఆ మేరకు వున్న సీన్లలోనే అడ్ఙస్ట్ మెంట్ లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే స్వతహాగా తెలుగుదేశం అభిమాని అయిన బుర్రా సాయి మాధవ్ తన డైలాగుల్లో ఈసారి కాస్త పొలిటికల్ టచ్ ఇస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 

అసలే రాయలసీమ బ్యాక్ డ్రాప్, అన్నగారు అనే వర్కింగ్ టైటిల్..ఆపై పోలిటికల్ ప్లస్ డివోషనల్ టచ్ వుండే డైలాగులు అంటే సినిమాను పక్కా కమర్షియల్ ప్యాకేజ్ గా తయారు చేస్తున్నారన్నమాట.

Show comments