ఆ డైరక్టర్ కు నాని చాన్స్ ఇస్తారా?

కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో ఓ ఇంటలెక్చ్యువల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నారు హను రాఘవపూడి. కానీ ఆ పేరు మొత్తం పోవడానికి ఎంత కాలమో పట్టలేదు. లై, పడి పడి లేచెమనసు సినిమాలు నిర్మాతలను, బయ్యర్లను కుదేలు చేసాయి. హీరోల కెరీర్ కు లెగ్ బ్రేక్ వేసేసాయి. దాంతో ఇక డైరక్టర్ గా హను రాఘవపూడి కెరీర్ కు ఫుల్ స్టాప్ నే అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి.

కానీ లేటెస్ట్ గా హను రాఘవపూడి హీరో నాని డేట్ ల కోసం ట్రయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నానికి లైన్ చెప్పి, అలాగే వీలయితే మొత్తం కథ చెప్పి ఒప్పించే పనిలో హను బిజీగా వున్నారని తెలుస్తోంది. అంత ఎగ్జయిట్ చేసే స్టోరీ తెస్తే నాని ఓకె అనే అవకాశం వుంది. కానీ అసలే నాని కెరీర్ కూడా ఏమంత అద్భుతంగా లేదు. జెర్సీ ఓకె అనిపించుకుంది. గ్యాంగ్ లీడర్ ఎలా వుంటుందో తెలియదు. ఇంద్రగంటి 'వి' సినిమా అన్నది ఓ ప్రయత్నం.

ఈ రెండు సినిమాల తరువాత ఏ సినిమా చేయాలన్నది ఇంకా డిసైడ్ కాలేదు. గ్యాంగ్ లీడర్ ఫలితం బట్టి నాని లైనప్ ఆధారపడి వుంటుంది. గ్యాంగ్ లీడర్ హిట్ అయితే కచ్చితంగా మంచి ప్రాజెక్టు, మంచి కాంబినేషన్ కోసం చూస్తాడు. లేదూ తేడా వస్తే, మరింత జాగ్రత్తగా ప్రాజెక్టు సెట్ చేయాలని చూస్తాడు. ఈ రెండు ఈక్వేషన్ల రీత్యా చూసుకుంటే హను రాఘవపూడికి హీరో నాని డేట్ లు దొరకడం అంత వీజీ కాకపోవచ్చు.

సాహోపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయంటే..