ఇదేం రాజకీయం పవన్.. జనసేనలో సభ్యత్వ దందా

పార్టీ సభ్యత్వాల నమోదులో ఇప్పటి వరకూ బీజేపీది వరల్డ్ రికార్డ్. మిస్డ్ కాల్ ఇస్తే చాలు బీజేపీ సభ్యుడిగా గుర్తింపు ఇచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువమంది సభ్యులున్న పార్టీగా తమకి తామే కితాబులిచ్చుకున్నారు కమలనాధులు. ప్రస్తుతం జనసేన కూడా అదే దారిలో వెళ్తున్నట్టుంది. కాకపోతే కాస్త కాస్ట్ లీ మార్గాన్ని ఎంచుకుంది.

పవన్ కల్యాణ్ అభిమానులంతా గతంలో జనసేనలో ఉచితంగా సభ్యత్వాలు తీసుకున్నారు. అయితే అలాంటి సభ్యత్వాల పట్ల లాభం లేదనుకున్నారు జనసేనాని. పవన్ సినిమాలు చూస్తాం, జగన్ కి ఓట్లేస్తాం అని గతంలో చాలామంది పవన్ మొహానే చెప్పిన సందర్భాలున్నాయి.

పలు రివ్యూ మీటింగుల్లో కూడా మీరు నాకు ఓటేశారా అంటే.. నిజాయితీగా వేయలేదని పవన్ కి చెప్పిన జనసైనికులూ ఉన్నారు. అందుకే ఈసారి వీఐపీ సభ్యత్వాలకు శ్రీకారం చుట్టారు పవన్.

డబ్బులిస్తేనే పార్టీ సభ్యత్వం ఇస్తారు, అలాంటి క్రియాశీలక సభ్యుల్నే పార్టీ సమావేశాలకు పిలుస్తారు. రాష్ట్రవ్యాప్తంగా తొలుత 5 నియోజకవర్గాల్లో ఈ వీఐపీ సభ్యత్వాల నమోదు మొదలైంది. ఒక్కొకరికి 500 రూపాయల సభ్యత్వ రుసుము, నియోజకవర్గానికి 500 మంది వీఐపీ సభ్యులు. ఇదీ జనసేన ఇన్ చార్జ్ లకు జనసేనాని ఇచ్చిన టార్గెట్.

Readmore!

అంటే ప్రతి నియోజకవర్గం ఇన్ చార్జ్ కి అక్షరాలా 2 లక్షల 50వేల రూపాయల తడి పడిందన్నమాట. సహజంగా పార్టీ సభ్యత్వాలెవరూ స్వచ్చందంగా తీసుకోరు. కార్యకర్తల తరపున నాయకులే ఆ పని పూర్తి చేస్తుంటారు. పవన్ ఏకంగా 500 రూపాయల సభ్యత్వ రుసుము అని చెప్పి, క్రియాశీలక సభ్యులు అంటూ ఓ ట్యాగ్ ఇచ్చేసి మరీ వసూళ్ల పర్వానికి తెరతీసే సరికి నియోజకవర్గాల ఇన్ చార్జ్ లు హడలిపోతున్నారు.

ఇలా 175 నియోజకవర్గాలకు గాను పవన్ వసూలు చేయాలనుకుంటున్న మొత్తం అక్షరాలా 4 కోట్ల 37లక్షల 50వేల రూపాయలు. భవిష్యత్ లో టికెట్ ఆశించేవాళ్లు, భవిష్యత్ కోసం పునాదులు వేసుకునేవాళ్లు అందరూ.. ఇప్పుడీ క్రియాశీలక సభ్యత్వాల నమోదులో పోటీ పడుతున్నారు. ఇచ్చాపురం, రాజోలు, నెల్లూరు రూరల్, మంగళగిరి, అనంతపురం నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని మొదలు పెట్టారు.

ఈ వీఐపీ సభ్యత్వాల వ్యవహారాన్ని చూసి ఇన్ చార్జ్ లు హడలిపోతుంటే.. జనసైనికులు నొచ్చు కుంటున్నారు. ఇకపై ఎవరైనా జనసేన సభ్యుడిని అంటే సరిపోదు, క్రియా శీలక సభ్యుడిని, వీఐపీ జనసైనికుడిని అని చెప్పుకోవాలేమో. బహుశా.. పవన్ అభిమానులు, జనసైనికుల మధ్య ఇప్పుడు ఓ చిన్నపాటి గీత ఏర్పడుతుందేమో.

నాకు జగన్ ఇచ్చిన గౌరవం అది

నా ఆరోప్రాణం వెళ్ళిపోయింది..కె విశ్వనాధ్

Show comments