విజయ్, దుల్కర్, సేతుపతి సింగేసారు

టాలీవుడ్ యంగ్ సంచలనం విజయ్ దేవరకొండ తొలిసారి ఆల్ సౌత్ లాంగ్వేజెస్ లో సినిమా విడుదల చేస్తున్నారు. మైత్రీమూవీస్ నిర్మించే డియర్ కామ్రేడ్ సినిమాను తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు ఆయా భాషల్లో జనాల్లోకి తీసుకెళ్లడం కోసం విజయ్ ఎంత చేయాలో అంతా చేస్తున్నారు.

ఇప్పటికే బెంగుళూరు, కోచ్చిలో ఫంక్షన్ లు చేసి, హీరోయిన్ రష్మిక మడొన్నాతో కలిసి హల్ చల్ చేసారు. అన్ని భాషల్లో సినిమాకు క్రేజ్ తీసుకురావడం కోసం ఎంతచేయాలో అంతా చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలో ఓ పాటను మూడు భాషల్లో ముగ్గురు హీరోలు పాడుతున్నారు.

ఇందుకోసం విజయ్ నే చొరవ తీసుకుని, ఆయా హీరోలను సంప్రదించి ఒప్పించాడు. మలయాళంలో దుల్కర్ సల్మాన్, తమిళంలో విజయ్ సేతుపతి ఆ పాటను పాడగా, తెలుగులో విజయ్ దేవరకొండనే పాడేసాడు. విజయ్ ఇలా పాట పాడడం ఇది రెండోసారి. మొత్తంమీద డియర్ కామ్రేడ్ విడుదలకు ముందే రకరకాల హడావుడి సృష్టిస్తోంది.

పూరి చూసిన ఎత్తుపల్లాలు ఏమిటి

Advertising
Advertising