'బిచ్చగాడు' ముసుగులో ఆంటోనీ వేషాలు

తెలుగు ప్రజల ఖర్మ కాలి, విజయ్ ఆంటోనీ అదృష్టం పండి ఒకేఒక్క సినిమా ఇక్కడ హిట్ అయింది. అదే బిచ్చగాడు. ఇక చూస్కోండి.. ఆ సినిమా నుంచి విజయ్ ఆంటోనీ తెలుగు ప్రజలపై తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో కోలుకోలేని దెబ్బకొడుతూనే ఉన్నాడు. తాజాగా వచ్చిన రోషగాడు సినిమా ఈ పైత్యాన్ని పీక్స్ కు తీసుకెళ్లింది.

విజయ్ ఆంటోనీ సినిమాలు కొత్తగా ఉంటాయి, అతడి సినిమాల్లో కంటెంట్ బాగుంటుందని ఫీలయ్యే అతికొద్ది మాత్రం ఆడియన్స్ ను కూడా రోషగాడు డిసప్పాయింట్ చేస్తాడు. ఇకపై తన సినిమాల్ని చూడొద్దంటూ విజయ్ ఆంటోనీ తనకుతానే సందేశం ఇచ్చుకున్నట్టుగా ఉంది ఈ సినిమా.

బిచ్చగాడు గ్రాండ్ సక్సెస్ తర్వాత విజయ్ ఆంటోనీ తన సినిమాలన్నింటినీ వరుసగా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. కానీ ఒక్క సినిమా కూడా అతడికి కలిసిరావడం లేదు. బిచ్చగాడు రేంజ్ సక్సెస్ మాట అటుంచి కనీసం ఓ మోస్తరుగా కూడా జనాల్ని ఎట్రాక్ట్ చేసిన సినిమా రాలేదు. భేతాళుడు, ఇంద్రసేన, కాశి, యమన్ లాంటి సినిమాలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.

ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ కు ముందే తన సినిమాలో మొదటి 8-10 నిమిషాల క్లిప్ ను విజయ్ ఆంటోనీ విడుదల చేసేవాడు. భేతాళుడు, యమన్ లాంటి సినిమాలకు అది మంచి ప్రచారాస్త్రంగా పనికొచ్చింది. రోషగాడు విషయంలో ఆ పని కూడా చేయలేదు ఆంటోనీ. దీంతో ఏదో ఆశించి థియేటర్లలోకి ఎంటరైన ప్రేక్షకుడికి ఇంకేదో కనిపించింది.

ప్రస్తుతం విజయ్ ఆంటోనీకి తెలుగుతో పాటు తమిళ్ లో కూడా మార్కెట్ పడిపోయింది. ఈ హీరో తన పంథా మార్చాల్సిన టైమ్ వచ్చింది.

Show comments