ఫ్రీ పథకాలకు ని'బంధనాలు'

నిజం నిష్టూరంగా వుంటుంది. సినిమాల్లోనో, మీడియాలోనూ కనిపించే పల్లెలు వేరు. వాస్తవంగా ఇప్పటి పల్లెలు వేరు. ఆ సంగతి పల్లెలతో నిత్యం మమేకం అయిన వారికి తెలుస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఆదాయం అన్నది క్లియర్ గా లేకపోవడం అంటే పే స్లిప్ లేదా అక్కౌంట్ ఫర్ కాకపోవడం అన్నది పల్లెల్లో నూటికి తొంభై శాతం మందిని బిపిఎల్ (బిలో పావర్టీ లైన్ ) కిందనో, తెల్లకార్డు దారులు గానో చూపిస్తున్నాయి. దీంతో ప్రతి పథకం వారికి అందుతోంది.

పల్లెలకు సౌకర్యాలు చేరువ కాక పోవచ్చు. రోడ్లు సరిగ్గా లేకపోవచ్చు, కరెంట్ అంతగా వుండకపోవచ్చు, బ్రాడ్ బ్యాండ్ సేవలు రాకపోవచ్చు. కానీ ప్రజలకు విలాసాలు మాత్రం భయంకరంగా వచ్చాయి. కలర్ టీవీలు, బైక్ లు, స్మార్ట్ ఫోన్ లు లేని జనాలు లేరు పల్లెటూళ్లలో. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అయినా కూడా పండగలకు ఫ్రీ సరుకులు, నెలనెలా ఫింఛన్లు, తెల్ల కార్డులు, ఆరోగ్య శ్రీ. ఓట్ల రాజకీయం మనది.

ఇదంతా ఎందకు ప్రస్తావించడం అంటే, కేంద్రం ఇచ్చిన కొత్త మార్గ దర్శకంపై మన మీడియా అయ్యో ఇలాగైతే ఎలా అంటోంది..ఏమిటా మార్గ దర్శకం అంటే, ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే పక్కా ఇళ్ల స్కీమ్ లో కొన్ని రూల్సు పెట్టారు. బైకు వుండి, ఫ్రిజ్ వుంటే పక్కా ఇల్లు కు ఎలిజిబుల్ కాదు. అయిదు ఎకరాల పల్లం, ఏడు ఎకరాల మెట్ట వున్నా కూడా అనర్హులే. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వున్నా అనర్హులే. 

ఈ మార్గ దర్శకాలు కొందరి విషయంలో కాస్త ఇబ్బందే అనుకోవచ్చు. కానీ పల్లెల్లో జరుగుతున్న వాస్తవాలు చూస్తుంటే సబబే అనిపిస్తుంది. పల్లె యువత ఆధునిక బైక్ లపై చేస్తున్న ఖర్చును, మద్యంపై పెడుతున్న ఖర్చును సర్వే చేస్తే కళ్లు చెదిరే వాస్తవాలు బయటకు వస్తాయి. గట్టిగా 500 గడప లేని పలెల్లో రోజుకు యాభై వేల మద్యం అమ్మేస్తున్నారు. రోజుకు మూడు వేల రూపాయిల టాక్ టైమ్ లు అమ్మేస్తున్నారు. మరి ఆదాయం లేకుండా ఎక్కడి నుంచి వస్తోంది ఈ టర్నోవర్. మరి అంతటి ఆదాయం వున్నవాళ్లకు ఇంకా ప్రభుత్వ ఫ్రీ పథకాలు అవసరమా? 

ప్రయవేటు, ప్రభుత్వ ఉద్యోగం వున్నవారి ఆదాయ లెక్కలు పక్కాగా వుంటున్నాయి. వ్యవసాయ ఆదాయ లెక్కలు అంతంతమాత్రంగా వుంటున్నాయి. దీంతో ప్రభుత్వ పథకాలు అనవసరంగా అనర్హుల పాలవుతున్నాయి. కష్టపడి సంపాదించుకుని, పన్నులు కట్టిన వారి సొమ్ము ఇలా ఫ్రీ ఫ్రీ పథకాల పాలవుతోంది. మోడీ ప్రభుత్వం ఈ వ్యవహారానికి మెల మెల్లగా చెక్ పెట్టేపని మొదలు పెట్టినట్లుంది.

Show comments