వరుణ్‌ తేజ్‌ రేట్‌ పెంచేసాడు

టయర్‌ 2 హీరోలలో నిలకడ చూపిస్తూ వరుసగా హిట్లు కొడుతోన్న వరుణ్‌ తేజ్‌ పారితోషికం పెంచేసాడనే టాక్‌ వినిపిస్తోంది. ఫిదా, ఎఫ్‌ 2లాంటి భారీ విజయాలతో పాటు తొలిప్రేమ, వాల్మీకిలాంటి డీసెంట్‌ సక్సెస్‌లు అందుకున్న వరుణ్‌ తేజ్‌ మార్కెట్‌ ఇంకా స్టేబులైజ్‌ అవలేదు. ఫిదా యాభై కోట్ల వరకు షేర్‌ రాబట్టగా, వెంకటేష్‌తో కలిసి చేసిన ఎఫ్‌ 2 ఎనభై కోట్లు వసూలు చేసింది.

కానీ తొలిప్రేమ, వాల్మీకి పాతిక కోట్ల రేంజ్‌తోనే సరిపెట్టుకున్నాయి. అయినా కానీ వరుణ్‌ తేజ్‌ తనకి ఎనిమిది కోట్ల పారితోషికం కావాలని అడుగుతున్నాడట. నానికి ఎనిమిది నుంచి పది కోట్ల వరకు పారితోషికం ఇస్తూ వుండగా, ఆ స్థాయి హీరోలలో నాని మాదిరిగా నిలకడ చూపిస్తోన్న వరుణ్‌ తేజ్‌ కూడా ఇంచుమించు అంతే కావాలని అంటున్నాడట. అయితే ఫ్లాప్‌ టాక్‌ వచ్చినా కానీ గ్యాంగ్‌లీడర్‌తో ఓపెనింగ్స్‌ వరకు రాబట్టాడు నాని.

అదే విధంగా వరుణ్‌ తేజ్‌ ఫ్లాప్‌ సినిమాలకి కనీస వసూళ్లు వస్తున్నాయా అంటే అదేమీ జరగడం లేదు. అంతరిక్షం చిత్రానికి గౌరవప్రదమైన వసూళ్లు కూడా రాలేదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని వరుణ్‌ అడుగుతోన్న పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సుముఖంగా వుంటారో లేక లాభాలలో వాటా ఇస్తామని అంటారో? 

సినిమా రివ్యూ: రాజుగారి గది 3

Show comments