నెక్ట్స్ ఏంటి: ఉత్తమ్ గడ్డం.. బండ్ల బ్లేడ్

తెలంగాణ ఎన్నికల ప్రహసనంలో ప్రజల్ని బాగా ఎట్రాక్ట్ చేసిన సవాళ్లు రెండంటే రెండు మాత్రమే. వాటిలో ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం కాగా, రెండోది బండ్ల గణేష్ బ్లేడ్ కహానీ. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకంటానంటూ కేటీఆర్ తో పాటు పలువురు నేతలు చేసిన రొటీన్ వ్యాఖ్యలు కంటే ఉత్తమ్, బండ్ల చేసిన వ్యాఖ్యలే జనాల్ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేశాయి.

తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాతే గడ్డం గీస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ను ఓడించేందుకు ఏకంగా కూటమిని ఏర్పాటుచేసి మరీ ఎన్నికలకు వెళ్లారు. కానీ తెలంగాణ ఎన్నికల్లో కూటమి చిత్తుగా ఓడిపోయింది.

తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు ఏకపక్షంగా తీర్పునిచ్చారు. మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ ఏం చేయబోతున్నారు? పెంచిన గడ్డాన్ని మరో ఐదేళ్ల పాటు అలానే కంటిన్యూ చేస్తారా..? లేక ఒట్టు తీసి గట్టున పెట్టి గడ్డం గీసుకుంటారా..? దీనికి సమాధానం ఆయనే చెప్పాలి.

ఇక బండ్ల గణేష్ ది మరో కథ. తెలంగాణలో మహాకూటమికి వందకు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేసిన బండ్ల, అక్కడితో ఆగితే సరిపోయేది. మహాకూటమి అధికారంలోకి రాకపోతే సెవెన్-ఓ-క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానంటూ శపథం చేసి కామెడీ చేశారు.

రిజల్ట్స్ వచ్చినరోజు మహాకూటమి గెలిస్తే స్వీట్స్ తో తన ఇంటికి రావాలని, ఓడిపోతే సెవెన్-ఓ-క్లాక్ బ్లేడ్ తీసుకొని రావాలని రిపోర్టర్లకు సూచించారు. అయితే గతంలో ఇలాంటి ఎన్నో సవాళ్లు చేసి తర్వాత "తూచ్ అలాంటిదేం లేదని" తప్పించుకోవడం బండ్లకు వెన్నతో పెట్టిన విద్య.

కాకపోతే నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన బండ్ల, ఈ కొద్దిరోజులకే మళ్లీ సినిమాలు చేసుకుంటానని ప్రకటించి అభాసుపాలయ్యారు. 

Show comments