త్రివిక్రమ్-బన్నీ... మళ్లీ మరోటి

పెద్ద సినిమాలకు టైటిళ్లు ఫిక్స్ చేసే వరకు ఏదో ఒక గ్యాసిప్ బయటకు వస్తూనే వుంటుంది. త్రివిక్రమ్ -బన్నీ కాంబినేషన్ లో సినిమా మొదలుకానుంది. ఈ సినిమాలో తండ్రి విపరీతంగా అబద్దాలు ఆడతాడని, కొడుకు దాన్ని నిజాలు చేసే ప్రయత్నం చేస్తుంటాడని, అందుకే సినిమాకు నాన్న- నేను అనే టైటిల్ కూడా వినిపించింది.

కానీ మరో గ్యాసిప్ బయటకు వచ్చింది. బన్నీ సూచన మేరకు స్క్రిప్ట్ కాస్త మారిందని, సన్నాఫ్ సత్యమూర్తి ఫాదర్ సెంటిమెంట్ తో చేసినందున, తల్లి సెంటిమెంట్, తల్లి పాత్ర కూడా బలంగా వుండేలా మార్చారని టాక్ వినిపిస్తోంది. అందుకే ఏరి కోరి టబును తీసుకున్నారని తెలుస్తోంది.

అందువల్ల 'అలకనంద' అనే టైటిల్ ఎలా వుందో అని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ను ఇప్పటికే త్రివిక్రమ్ హీరో బన్నీకి చెప్పి ఎలా వుందని అడిగినట్లు బోగట్టా. ఇప్పటికి ఇవీ టైటిళ్లు, మరి ఎన్ని చక్కర్లు కొట్టడం ప్రారంభిస్తాయో?

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!