టీడీపీ.. అప్పుడే ఒక సీట్లో చేతులెత్తేసింది!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఫలితాలను పొందుతుంది అనే అంశం గురించి ఈ ప్రాంత పరిస్థితుల గురించి బాగా ఎరుక ఉన్న ఒక సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ.. నాలుగైదు సీట్లలో టీడీపీ గెలిస్తే అదే ఎక్కువ అన్నారు! గత ఎన్నికల్లోనే టీడీపీ పదిహేను సీట్లలో సత్తా చూపించింది.. ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలిపినా.. అందులో మూడోవంతేనా అంటే.. అంతకు మించి సీన్ లేదని సదరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ విశ్లేషణ విన్నాకా కూడా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే.. అవి ప్రాక్టికల్ గా నిరూపితం అయ్యే టైమ్ మరెంతో దూరంలేదు.

తాజాగా అదే కథ మొదలైంది కూడా. మహాకూటమిలో చేరిన తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ ప్రసాదించిన సీట్లు పద్నాలుగు. ఇవి కూడా గత ఎన్నికల్లో టీడీపీ నెగ్గిన సీట్ల కంటే తక్కువే. టీడీపీకి మరీ ఇన్ని తక్కువ సీట్లా అని కొంతమంది ఆ పార్టీ వీరాభిమానులు ఫీలయ్యారు.

అయితే.. కనీసం ఆ అన్ని సీట్లలోనూ అభ్యర్థులను నిలుపుకోలేకపోయింది ఆ పార్టీ. తెలంగాణలో నామినేషన్స్ పర్వం ముగిసిన నేపథ్యంలో పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థులు ఎంతమంది అంటే.. పదమూడు మంది మాత్రమే.

కూటమి సైకిల్ పార్టీకి పద్నాలుగు సీట్లను కేటాయించినా, టీడీపీ పదమూడు సీట్లలో మాత్రమే బీఫారాలు ఇచ్చింది. దీంతో పదమూడు సీట్లలో మాత్రమే సైకిల్ గుర్తు ఉంటుంది. ఇలా నామినేషన్స్ దశలోనే ఒక సీట్లో టీడీపీ చేతులు ఎత్తేసింది.

అవతల దానికంటూ క్యాడర్ ఉందో లేదో దానికే తెలియని టీజేఎస్ కూడా తనకు కేటాయించిన సీట్ల కంటే అదనంగా నామినేషన్స్ వేసే ఉత్సాహాన్ని చూపిస్తే టీడీపీ మాత్రం తన కోటాలో వచ్చిన సీట్లకు కూడా నామినేషన్స్ వేయలేకపోయింది. ఓటు పడక ముందే ఒక సీటును కోల్పోయింది!

బిడ్డా రాస్కో.. తెలంగాణ‌లో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments