సుమంత్ 'అక్కినేని' వచ్చేసాడు

సుమంత్ ను అక్కినేని హీరో అంటారు కానీ ఎఎన్నార్ కూతురు కొడుకు. అందువల్ల అక్కినేని సుమంత్ అనకపోవచ్చు. అయితే తాత దగ్గర పెరగడమే కాదు తాత పోలికలు పుణికి పుచ్చుకున్నాడు మొహంలో సుమంత్. అలాంటిది ఇప్పుడు ఏకంకా తాతగా నటించబోతున్నాడు. కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేనిగా కనిపించబోతున్నాడు సుమంత్. ఈసంగతి తెలిసిందే.

మరి ఈ అక్కినేని సుమంత్ ఎలా వుంటాడు? అదే ఇఫ్పుడు బయటకు వచ్చింది. అక్కినేని బర్త్ డే సందర్భంగా ఈ స్టిల్ బయటకు వదిలారు. అయితే ఇది తొలినాళ్లలో అక్కినేని మాదిరిగా గా కాకుండా, కాస్త మధ్యవయస్సు వచ్చిన తరువాత అక్కినేని ఎలా వుండేవారో, అలా వుంది. మహానటిలో నాగచైతన్యను, దేవదాస్ లో అక్కినేని మాదిరిగా గెటప్ వేసి చూపించారు. కానీ ఇక్కడ అక్కినేని రియల్ మేకప్ వేసి సుమంత్ ను అలా చూపించారు.

అక్కినేని ట్రేడ్ మార్క్ కళ్లజోడు, అక్కినేని లాల్చీతో సుమంత్ బాగానే సెట్ అయ్యాడు అనిపించుకున్నాడు. ఎలాగూ సుమంత్ కు తాత కళ్లు చూపు వచ్చాయి. అవి కాస్త ప్లస్ అయ్యాయి.

మరో స్టిల్ సాయంత్రం
ఇదిలా వుంటే ఈ సాయంత్రం మళ్లీ మరో స్టిల్ విడుదల చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ఎన్టీఆర్-ఎఎన్నార్ కలిసి వున్న స్టిల్ అది. అంటే సుమంత్, బాలయ్య అన్నమాట. మొన్న రానా-బాలయ్య కలిసి ఎన్టీఆర్ చంద్రబాబులుగా ఒకే ఫ్రేమ్ లో కనిపించినట్లుగానే, ఇప్పుడు సుమంత్-బాలయ్య కలిసి ఎఎన్నార్-ఎన్టీఆర్ లుగా ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతారన్నమాట. 

Show comments