అఖిల్‌ రీ-లాంఛ్‌ ఇంకెప్పుడు.!

బాల నటుడిగా 'సిసింద్రీ' సినిమాతో హిట్టు కొట్టేసిన అక్కినేని అఖిల్‌, హీరోగా మాత్రం తొలి ప్రయత్నంతోనే దారుణమైన పరాజయాన్ని చవిచూశాడు. హిట్టూ, ఫ్లాపూ సినీ రంగంలో మామూలే. మెగాస్టార్లు, సూపర్‌స్టార్లు కూడా ఫ్లాపుల్ని చవిచూసినవారే.. ఫ్లాపులతో కుంగిపోతే వాళ్ళు స్టార్లు ఎలా అవుతారు.? 

అంతెందుకు, నాగార్జున కెరీర్‌లో ఎన్ని ఫ్లాపులున్నాయి.? మళ్ళీ నాగార్జున తేరుకోలేదా.! అఖిల్‌ మాత్రం, తొలి సినిమా తర్వాత రెండో సినిమా చేయడానికి చాలా చాలా చాలా టైమ్‌ తీసుకున్నాడు. నాగార్జున అయితే, తన కుమారుడు అఖిల్‌ని రీ-లాంఛ్‌ చేయనున్నట్లు ప్రకటించి, అఖిల్‌ తొలి సినిమా 'అఖిల్‌'ని డిజాస్టర్‌ కా బాప్‌.. అనే ఫీలింగ్‌ని ఇంకాస్త ఎక్కువ చేశాడు. 

ఎలాగైతేనేం, చాలామంది దర్శకుల్ని అనుకుని, వారిలో కొందర్ని ఫిల్టర్‌ చేసేసి, చివరికి విక్రమ్‌ కుమార్‌ని ఫైనల్‌ చేశాడు నాగార్జున. అయినాగానీ, అఖిల్‌ రీ-లాంఛ్‌ మూవీ పట్టాలెక్కలేదు. ముందు అనుకున్న కథ కాకుండా, మరో కథని ఫైనల్‌ చేశామన్నది నాగార్జున తాజా ఉవాచ. ఈ కారణంగానే, అఖిల్‌ కొత్త సినిమా లేటయ్యిందట. అంతేనా, అఖిల్‌ రీ-లాంచ్‌ ఈసారి పక్కానా.? అయితే, అదెప్పుడు.? ఇవన్నీ ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నలే.

Show comments