స్పైడర్ లీకు ఓవర్ సీస్ పుణ్యమా?

స్పైడర్ ట్రయిలర్ లీకయిపోయింది. అభిమానులు ఫీలయ్యారు. కానీ అసలు ఎక్కడ వుంది లోపం? ఇదంతా ఓవర్ సీస్ బయ్యర్ల పుణ్యం అని టాక్ వినిపిస్తోంది. ఓవర్ సీస్ లో రీ మార్కెట్ చేసుడానికి వీలుగా, అన్ కట్ ట్రయిలర్ ను నిర్మాతలు ఓవర్ సీస్ బయ్యర్ లకు పంపించారు.

అక్కడ ఓవర్ సీస్ బయ్యర్లు ఆ ట్రయిలర్ తమ దగ్గర వుందహో అని డప్పేసారు. అక్కడితో ఆగకుండా కొందరికి మెయిల్స్ ద్వారా పంపించినట్లు వినికిడి. దీంతో ఎక్కడో ఓ చోట డౌన్ లోడ్ అయిపోయింది. ట్రయిలర్ బయటకు వచ్చేసింది.

పైగా స్పైడర్ సినిమా ఎల్ఎల్ పి. అంటే కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ప్రకటనలు ఇస్తారు. ఈ వ్యవహారం కొంత మందికి గిట్టదు. ఎప్పుడైతే ఓవర్ సీస్ లో సర్క్యులేషన్ లో వున్న ట్రయిలర్ వాట్సప్ ల్లో కనిపించిందో, వెంటనే అందుకుని ఇక్కడ కూడా చలామణీలోకి తెచ్చేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా కొందరు ఎల్ ఎల్ పి మీద కసి తీర్చుకున్నట్లు కనిపిస్తోంది.

ఏమయితేనేం మొత్తానికి ఈ నెల 12న థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కాలేదు. 15న ఫంక్షన్ లో విడుదల అనుకున్నారు కాలేదు. ఇలా మధ్యలో అనవసరంగా జనాల చేతుల్లో పడి, వాట్సప్ లో విడుదలయిపోయింది.

Show comments