రాత్రికి వస్తే ఛాన్స్ ఇస్తా.. దర్శకుడు?

కాస్టింగ్ కౌచ్ మరోసారి తెరపైకొచ్చింది. మీ-టూ ఉద్యమం తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిందనుకున్న ఈ సంస్కృతి మరోసారి బయటపడింది. ఓ రాత్రి పడుకుంటే, విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని ఓ దర్శకుడు తనకు "ఆఫర్" ఇచ్చాడంటూ ఆరోపణలు చేసింది తమిళ నటి షమ్ము. ఆ దర్శకుడు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ దేవరకొండతో సినిమాలు చేయబోతున్న దర్శకుల లిస్ట్ లో అతడి పేరు కూడా ఉందని చెప్పిన షమ్ము, ఆ పేరును మాత్రం బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. దీంతోపాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందట. దీంతో పాటు మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై హీరో అనే మరో సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాకు ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.

షమ్ము ఆరోపణల ప్రకారం చూసుకుంటే.. ప్రస్తుతం ఈ ముగ్గురిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ముగ్గుర్లో ఒకరు షమ్ముతో అనైతికంగా ప్రవర్తించి ఉంటారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా విజయ్ దేవరకొండ పేరును వాడుకుందనే వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టేసింది ఈ హీరోయిన్.

జరిగిన ఈ ఘటనపై తను ఎలాంటి ఫిర్యాదులు చేయబోవడం లేదని స్పష్టంచేసింది షమ్ము. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటి చేదు అనుభవాలు సహజమని, వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని ప్రకటించింది. దీనిపై ఎవరికీ ఎలాంటి ఫిర్యాదు మాత్రం చేయనని అంటోంది. 

జగన్ కేబినెట్లో సీమ మంత్రులు ఎవరెవరు?

Show comments