క్రికెట్ కోచ్ గా మారబోతున్న కట్టప్ప

బాహుబలి సినిమాలో చేసిన కట్టప్ప పాత్రతో దేశవ్యాప్తంగా పాపులరైన నటుడు సత్యరాజ్. ఆ సినిమాకు ముందు టాలీవుడ్ లో సత్యరాజ్ వేరు. ఆ సినిమా తర్వాత సత్యరాజ్ వేరు. బాహుబలి తర్వాత సాధారణమైన పాత్రలకు సత్యరాజ్ ను తీసుకోవడం లేదు. ఎంతో ప్రాధాన్యం ఉంటే తప్ప అతడ్ని పిలవడంలేదు. ఇప్పుడీ నటుడికి టాలీవుడ్ నుంచి అలాంటి పిలుపే మరొకటి వచ్చింది.

నాని హీరోగా త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న జెర్సీ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించబోతున్నాడు సత్యరాజ్. నానిని క్రికెటర్ గా తీర్చిదిద్దే కోచ్ పాత్ర ఇది. కేవలం కోచ్ గానే కాకుండా, నాని లైఫ్ లో కీలకమైన వ్యక్తిగా సత్యరాజ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. 

తమ సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడనే విషయాన్ని దర్శకుడు గౌతమ్ బయటపెట్టాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దసరా రోజున ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే హైదరాబాద్ లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. 

జెర్సీ సినిమాకు సంబంధించి నాని ఇప్పటికే క్రికెట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. సరికొత్త నానిని చూస్తారంటూ ఊరిస్తున్నాడు. అటు హీరోయిన్ గా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాధ్ ను ఇప్పటికే ఎంపిక చేశారు. ఇప్పుడు సత్యరాజ్ కూడా వచ్చిచేరాడు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చెన్నైలో ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తున్నాయి.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments