సర్కారోడు..సిఇఓ..ఇప్పుడు గేమ్ ఛేంజ‌ర్

రామ్ చరణ్..శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ రేపు రాబోతోంది. ఈ సినిమాకు అన్నింటికన్నా ముందుగా సర్కారోడు అన్న టైటిల్ వినిపించింది. అయితే పాన్ ఇండియా సినిమా కనుక ఇంగ్లీష్ టైటిల్ అయితే బెటర్ అని దానిని పక్కన పెట్టినట్లు తరువాత వార్తలు వినిపించాయి. 

రెండో టైటిల్ గా సిఇఓ అనే టైటిల్ బయట వినిపించడం ప్రారంభమైంది. ఈ టైటిల్ కు యనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అదే ఫిక్స్ అనేసుకున్నారు కూడా. కానీ ఈసారి అబ్జ‌క్ష‌న్ దర్శకుడు శంకర్ నుంచే వచ్చినట్లు తెలుస్తోంది.

కేవలం సిఇఓ అని పెడితే సరిపోదని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అన్నది కూడా వుండాలని, కానీ అలా చేస్తే ఏమైనా అబ్జ‌క్షన్ లు రావచ్చు అని, అందువల్ల లిస్ట్ లో వున్న ఆఖరి ఆప్షన్ కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ మూడో టైటిల్ లో రెండు ఇంగ్లీష్ పదాలు వుంటాయి. రెండు కలిపి ఒక విశేషణంగా మారుతుంది. దాన్నే రేపు మార్నింగ్ అనౌన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. 

కానీ ఈ టైటిల్ పట్ల ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా వుంటుందో చూడాలి. ఎందుకంటే ఈ పదం ఫ్యాన్స్ కు అంతగా పడుతుందా? కామన్ ప్రేక్షకుడు ఏ మేరకు ఈ టైటిల్ తో కనెక్ట్ అవుతాడు అన్నది అనుమానమే.

అదే రోజు సాయంత్రం ఫస్ట్ లుక్ ఇస్తారు. విడుదల తేదీ సంగతి ఇంకా క్లారిటీ లేదు. సంక్రాంతికి రావడం కష్టమే అని సమ్మర్ కే విడుదల అని తెలుస్తోంది.

Show comments