సమంత స్టార్ డమ్.. నయనతారకు చెక్!

వరసపెట్టి లేడి ఒరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చూపిస్తోంది సమంత. పెళ్లయ్యాకా సమంతకు రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆ అవకాశాన్ని ఆమె నటిగా తన స్థాయిని పెంచుకునేందుకు ఉపయోగించుకుంటూ ఉంది. తనే ప్రధాన పాత్రల్లో నటించే సినిమాలనే ఎంపిక చేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఆమెకు వరసగా హిట్స్ కూడా లభిస్తూ ఉన్నాయి. కమర్షియల్ గా అవేం అంత సూపర్ హిట్ కాకపోయినా.. ప్రశంసలకు అయితే లోటు లేదు. ఈ నేపథ్యంలో సమంత అలాంటి సినిమాలు మరిన్ని చేయడానికి రెడీ అయిపోతూ ఉందని స్పష్టం అవుతోంది. ఆ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది.

ఈ నేపథ్యంలో నయనతార చేయాల్సిన ఒక సినిమా సమంత వైపు మొగ్గు చూపుతోందని సమాచారం. ఇదివరకూ తమిళంలో వచ్చిన 'అరమ్' సినిమాకు సీక్వెల్ లో సమంత నటించబోతోందని సమాచారం. తెలుగులో 'కర్తవ్యం' పేరుతో విడుదల అయిన ఆ సినిమాకు సీక్వెల్ ప్రతిపాదన ఉంది.

ముందుగా నయనతారే అందులో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సమంతకు ఆ అవకాశం దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. నయనతార ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తనే ప్రధాన పాత్రను చేస్తూ పలు సినిమాలను లీడ్ చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో సమంత నుంచి ఆమెకు పోటీ ఎదురవుతున్నట్టుగా ఉంది!

ముద్దు ముద్దు మాటలతో దొరసాని.. ఏమి చెప్పిందంటే

Show comments