RRRకు ఏడాది.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే!

విడుదలకు ముందే ఏడాది పూర్తిచేసుకుంది RRR మూవీ. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభమై నిన్నటికి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో ఎన్నో అవాంతరాలు దాటుకొని, షూటింగ్ ను కొనసాగిస్తున్నాడు జక్కన్న. కాకపోతే అభిమానుల వైపు నుంచి కూడా కాస్త ఆలోచిస్తే బాగుండేది.

అవును.. ఏడాది కంప్లీట్ అవుతున్నా ఇప్పటివరకు ఆర్-ఆర్-ఆర్ నుంచి ఒక్క లుక్ కూడా రిలీజ్ చేయలేదు రాజమౌళి. దీనికి అతడి కారణాలు అతడికి ఉన్నాయి. సినిమా విడుదలకు ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి ఇప్పట్నుంచే హంగామా చేయడం ఎందుకనేది అతడి పాయింట్. కానీ ఏడాదైనా ఇప్పటివరకు ఒక్క లుక్ కూడా రిలీజ్ చేయకపోతే ఎలా అనేది అభిమానుల క్వశ్చన్.

పైగా ఇది ఏ ఒక్క హీరోకో చెందిన డిమాండ్ కాదు. అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు చరణ్ ఫ్యాన్స్ ఇద్దరూ చేస్తున్న జాయింట్ డిమాండ్. అటు రాజమౌళి సినిమాల్ని ఇష్టపడే సామాన్య ప్రేక్షకులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. వీళ్లందరి కోసమైనా రాజమౌళి తన సినిమా నుంచి ఓ స్టిల్ విడుదల చేస్తే బాగుండేది. లుక్ ఇష్టంలేకపోతే కనీసం వర్కింగ్ స్టిల్స్ అయినా విడుదల చేయాలి కదా. ఆ ప్రయత్నం కూడా జరగలేదు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఫలానా తేదీకి రాబోతున్నాయంటూ గతంలో చాలా ప్రచారమే జరిగింది. కానీ అవేవీ నిజాలు కాలేదు. చివరికి కొమరంభీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లుక్ విడుదల చేస్తారనే రూమర్ కూడా నిజం కాలేదు. దీంతో అంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరో ప్రచారం ఊపందుకుంది.
 
ఆర్-ఆర్-ఆర్ కు సంబంధించి డిసెంబర్ 31 లేదా జనవరి 1న ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేస్తారట. ఇక సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ లుక్ కూడా వదుల్తారట. అలా సినిమా ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. అక్కడికి సినిమా విడుదలకు 6 నెలలు టైమ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రచారం కాస్త నమ్మేలానే ఉంది. ఎందుకంటే, గతంలో బాహుబలి పార్ట్-1కు కూడా సరిగ్గా ఇలానే 6 నెలల ముందు ప్రచారం ప్రారంభించారు. 

Show comments