రంగంలోకి సాయి కుమార్!

మూడు నెలలు ముందుగానే మా సంఘంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పానెళ్లు రెడీ అవుతుంటే, వితవుట్ ప్యానల్ తో అధ్యక్ష పదవికి జీవిత రాజశేఖర్ పోటీ చేయబోతున్నారు. 

ఇప్పుడు అదే విధంగా వితవుట్ ప్యానల్ జనరల్ సెక్రటరీ పదవికి నటుడు సాయి కుమార్ కూడా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. గత కొంత కాలంగా మా వ్యవహారాల పట్ల సాయికుమార్ అసంతృప్తిగా వున్నారు. 

ప్రతి ఎన్నికల టైమ్ లోనూ పిలిచి, చిన్న చిన్న పోస్టులకు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గానూ సాయికుమార్ ను ప్రతిపాదిస్తున్నారు. ఆయన అవును అనలేక, కాదు అనలేక ఇబ్బంది పడుతున్నారు. తన సీనియార్టీ కి తనకు ఆఫర్ చేసే పోస్టులకు సంబంధం వుండడం లేదు.

తనను ఇక ఇలా ఎంత కాలం చిన్న, చితక పోస్టులకే పరిమితం చేస్తారా? అని ఆయన లోలోపల మధనపడుతున్నారు. అందుకే ఇప్పుడు వితవుట్ ప్యానల్ జనరల్ సెక్రటరీ పదవికి పోటీ  చేయాలని ఆలోచిస్తున్నారు.

Show comments