రంగరంగ వైభవంగా…సిరి సిరి మువ్వలోనే..

వైష్ణవ్ తేజ్ హీరోగా తయారవుతున్న సినిమా రంగ రంగ వైభవంగా. కేతికాశర్మ హీరోయిన్. తమిళ దర్శకుడు గిరిశాయి రూపొందిస్తున్న ఈ సినిమా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద బొగవిల్లి ప్రసాద్ నిర్మిస్తారు. సెప్టెంబర్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ వచ్చింది.

‘సిరి సిరి మువ్వల్లోనే నా గుండె చప్పుళ్లన్నీ.. నా గుప్పెడు గుండెళ్లోనే వినిపించాయే..’’

అని ప్రేయసి కేతికా శర్మను చూసి హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్‌ పాడుతుంటే..

‘‘నడి రాతిరి జాబిలీలోని కొలువుండే వెన్నెలలన్నీ నా కళ్లకు పట్టపగలే కనిపించాయి...’’ అంటూ ఆమె ప్రేమావేశంతో బదలు ఇచ్చింది.

అసలు ఏమిటీ ప్రేమ మైకం..రంగ రంగ వైభవంగా ఏం జరిగిందన్నది అసలు సినిమా అన్నమాట. శ్రీమణి ఈ పాటను రచించారు. జావేద్ ఆలీ..శ్రియా ఘోషల్ ఆలపించారు. దేవీశ్రీప్రసాద్ స్వరాలు అందించారు. ఇప్పటికే టీజర్ వదిలారు. మరో పాట కూడా వదిలారు. ఇవన్నీ కలిసి ఈ సినిమాకు మెలమెల్లగా బజ్ ను తీసుకువస్తున్నాయి.

Show comments