రాజుగారి గది 3 తొలిరోజు

రాజగారి గది పార్ట్ వన్, టు లు ఇచ్చిన బ్రాండింగ్ తోడుగా విడుదలయింది పార్ట్ 3. ఆ బ్రాండింగ్ వల్లే సినిమా ఫస్ట్ కాపీ ఏకంగా 8 కోట్లకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు అమ్ముడుపోయింది. ఆంధ్ర అంతా మూడు కోట్ల రేషియోలో,  సీడెడ్ 90 లక్షలకు విక్రయించేసారు. నైజాం బయ్యర్ వరంగల్ శ్రీను వుంచుకున్నారు.

సినిమాకు సమీక్షలు, ఫస్ట్ డే టాక్ సంగతి ఎలా వున్నా, ఓపెనింగ్స్ దాని రేంజ్ కు ఫరవాలేదు అన్నట్లుగా వచ్చాయి. రాజుగారిగది 3 తో పాటు విడుదలయిన సినిమాలు ఏవీ అంతగా కలెక్షన్లు రాబట్టుకోలేకపోయాయి. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కూడా అలాగే మిగిలిపోయింది. మార్కెట్ లో సరైన సినిమా లేకపోవడం రాజుగారి గది 3 కి కలిసి వచ్చింది.

తొలిరోజు కోటి ఇరవై లక్షల వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో షేర్ వసూలు చేసింది సినిమా. శని, ఆదివారాలు కూడా ఇలాగే వుంటే నైజాం సంగతి ఎలా వున్నా మిగిలిన ఏరియాలు నలభై శాతానికి పైగానే రికవరీ అయ్యే అవకాశం వుంది.

nizam.......45 లక్షలు
ceeded... 20 లక్షలు 
vizag....  16 లక్షలు 
east.......  9.50 లక్షలు 
west.......6 లక్షలు 
guntur.....14 లక్షలు 
krishna.....9 లక్షలు 
nellore....4 లక్షలు 

సినిమా రివ్యూ: రాజుగారి గది 3

Show comments