ఏది రియల్.. ఏది వైరల్: బిగ్ బాస్ లో డేటింగ్

బిగ్ బాస్ హౌజ్ లో ఎఫైర్లు కొత్త కాదు. హిందీ, తమిళ బిగ్ బాస్ హౌజ్ లో ఇలాంటివి చాలానే జరిగాయి. కానీ తెలుగు బిగ్ బాస్ కు మాత్రం ఇలాంటి హాట్ హాట్ ఎఫైర్లు చాలా కొత్త. ఫస్ట్ టైమ్ అలాంటి ఓ అనుబంధం హౌజ్ లో పెనవేసుకుంటోంది. అదే రాహుల్-పునర్నవి రిలేషన్ షిప్. అయితే ఇది కేవలం హౌజ్ కే పరిమితమా లేక వాళ్లిద్దరూ నిజంగానే క్లోజ్ అవుతున్నారా అనేది తేలాల్సి ఉంది.

రాహుల్-పునర్నవి చాలా క్లోజ్ అవుతున్నారనే విషయం బిగ్ బాస్ ఫాలో అవుతున్న వాళ్లకు ఎప్పటికప్పుడు అర్థమౌతూనే ఉంది. నాగార్జున కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. తాజాగా హౌజ్ లో జరిగిన ఓ టాస్క్ లో వీళ్లిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. కేవలం వీళ్లిద్దర్నీ టార్గెట్ చేస్తూ ఓ టాస్క్ డిజైన్ చేశారు. పునర్నవి కోసం రాహుల్ కాకరకాయ జ్యూస్ తాగాడు. వాంతులు చేసుకుంటూ మరీ కాకరకాయ రసం తాగేశాడు.

ఈ ఒక్క టాస్క్ తో పునర్నవి చలించిపోయింది. రాహుల్ ను గట్టిగా కౌగిలించుకుంది. ఓ ఘాటైన ముద్దు కూడా పెట్టేసింది. ఈ ఒక్క ముద్దుతో వీళ్లిద్దరి రిలేషన్ షిప్ పై అనుమానాలు మరింత పెరిగిపోయాయి. అయితే ఇదంతా టాస్క్ లో భాగమేనా, నిజంగా వీళ్లిద్దరు దగ్గరయ్యారా అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

బిగ్ బాస్ సీజన్-3 స్టార్ట్ అయినప్పట్నుంచి వీళ్లిద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం కనిపించింది. టాస్క్ లో కోసం ఓవైపు కొట్టుకుంటూనే, రాత్రి అయ్యేసరికి ఇద్దరూ ఓ చోటుకు చేరి కబుర్లు చెప్పుకునే వాళ్లు. లవ్, మ్యారేజ్, డేటింగ్ లాంటి విషయాలు మాట్లాడుకునేవాళ్లు. తాజాగా జరిగిన ఘటనతో వీళ్లిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారనే విషయం స్పష్టమైంది.

గ్రేట్ ఆంధ్ర ఈవారం స్పెషల్ బిగ్ స్టోరీ

Show comments