సాహో ప్రభాస్.. నో రియాక్షన్

సాహో రిలీజై 2 వారాలు దాటిపోయింది. కనీసం తన సినిమాపై తాను కూడా కామెంట్ చేయకుండా సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ప్రభాస్ ది. పోనీ ప్రభాస్ మీడియాకు దూరంగా ఉన్నాడా అంటే అదీ లేదు. ఇటీవలే హైదరాబాద్ లో సన్నిహితులతో కలసి సాహో సినిమా చూశాడు. రాత్రి గోపీచంద్ కొడుకు పుట్టినరోజు వేడుకలకీ హాజరయ్యాడు. కానీ అన్ని చోట్లా ప్రభాస్ మౌనాన్నే ఆశ్రయించాల్సి వచ్చింది.

సాహో హిట్టని చెప్పలేదు, ఫ్లాపని ఒప్పుకోలేదు, పోనీ ఓ వర్గానికి నచ్చింది అని కూడా స్టేట్ మెంట్ ఇవ్వలేదు. మేధావులకే అర్థమైంది, యాక్షన్ లవర్స్ ని ఆకట్టుకుంది అని కూడా కవర్ చేసుకునే ప్రయత్నం చేయడం లేదు ప్రభాస్. ఇటీవల మన్మథుడు-2 రిలీజై ఫస్ట్ డే నెగెటివ్ రివ్యూస్ వచ్చినప్పుడు నాగార్జున చేసిన కవరింగ్ అంతా ఇంతా కాదు. అప్పుడే జనాలకు ఎక్కదని, మెల్లగా పికప్ అవుతుందని, తన గత సినిమాలకు కూడా ఇలాగే ఫస్ట్ డే కామెంట్స్ వచ్చాయని, చాలా చాలా చెప్పుకున్నారు.

నాగార్జున ఒక్కరే కాదు, ఏ హీరో అయినా విడుదల తర్వాత తన సినిమాని కాస్తో కూస్తో లేపాలనే చూస్తారు. కొంతమంది సక్సెస్ మీట్లు, సక్సెస్ టూర్లతో హడావిడి చేస్తారు. కలెక్షన్ల లెక్కలు తీస్తారు. కానీ ప్రభాస్ మాత్రం అలాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉన్నాడు. ఎవరినీ నిందించడం లేదు, తన సినిమానీ పొగుడుకోవడం లేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రభాస్ అందరికీ నచ్చాడు.

మరోవైపు ట్రేడ్ మాత్రం 2 వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫ్లాప్ అని తేల్చేసింది. ఇప్పటికే గ్యాంగ్ లీడర్ థియేటర్లలోకి వచ్చేసింది. త్వరలోనే వాల్మీకి, బందోబస్త్ లాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి. సో.. ఇక సాహో పుంజుకోవడం దాదాపు కష్టం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అటుఇటుగా 50 కోట్ల నష్టం అంచనా వేస్తున్నారు. 

నాని చెప్పినట్లే సినిమా ఉందా..? ఫ్యామిలీ గ్యాంగ్‌ సంగతేంటి?

Show comments